Sunil Gavaskar Chetan Sharma : చేత‌న్ శ‌ర్మ‌పై స‌న్నీ సీరియ‌స్

ఫ్యాష‌న్ షోకి వెళితే బెట‌ర్

Sunil Gavaskar Chetan Sharma : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్, ప్ర‌ముఖ వ్యాఖ్యాత సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్(Sunil Gavaskar)  అలియాస్ స‌న్నీ నిప్పులు చెరిగారు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ చేత‌న్ శ‌ర్మ‌ను ఏకి పారేశాడు.

అస‌లు ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించాడు. ప్ర‌ధానంగా దేశీవాళి క్రికెట్ లో అద్బుత‌మైన ఆట తీరుతో రాణిస్తూ ప్ర‌శంస‌లు అందుకుంటున్న యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ను ఎంపిక చేయ‌క పోవ‌డాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించాడు.

ఫిట్ నెస్ బాగా లేక పోతే సెంచ‌రీలు ఎలా సాధిస్తాడంటూ ప్ర‌శ్నించాడు గ‌వాస్క‌ర్(Sunil Gavaskar) . ఒకానొక ద‌శ‌లో ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు సెలెక్ష‌న్ క‌మిటీపై. ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసేందుకు ఇక నుంచి ప్లేయ‌ర్ల ఆట తీరును ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నాడు.

ఆపై ఓ ఫ్యాష‌న్ షో నిర్వ‌హిస్తే బాగుంటుందంటూ ఎద్దేవా చేశాడు. ప్ర‌స్తుతం సునీల్ మ‌నోహ‌ర్ గ‌వాస్క‌ర్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆయ‌నే కాదు చాలా మంది మాజీ ఆట‌గాళ్లు సైతం మ‌రోసారి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ ఎంపిక‌పై.

మ‌రోసారి పూర్తి స్థాయిలో చీఫ్ సెలెక్ట‌ర్ గా ఎంపికైన చేత‌న్ శ‌ర్మ వివ‌క్ష చూపుతున్నాడ‌ని, ప్ర‌ధానంగా ఆడే ఆట‌గాళ్ల‌ను కావాల‌ని ప‌క్క‌న పెడుతున్నాడ‌ని మండిప‌డుతున్నారు. ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజూ శాంస‌న్ , దేశీవాలిలో రాణిస్తున్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్. 

తాజాగా స‌న్నీ చేసిన సీరియ‌స్ కామెంట్స్ మ‌రోసారి సెలెక్ష‌న్ క‌మిటీలోని డొల్ల‌త‌నాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఇక‌నైనా చేత‌న్ శ‌ర్మ(Chetan Sharma) పూర్తి పార‌ద్శ‌క‌త‌త‌తో ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్టాల‌ని కోరుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Also Read : కీవీస్ గెలిచేనా భార‌త్ నిలిచేనా

Leave A Reply

Your Email Id will not be published!