Nora Fatehi Jacqueline : 25న నోరా ఫతేహీ దావా విచారణ
నటి జాక్వెలిన్ పై పరువు నష్టం
Nora Fatehi Jacqueline : బాలీవుడ్ నటి నోరా ఫతేహీ కోలుకోలేని షాక్ ఇచ్చింది మరో నాటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Nora Fatehi Jacqueline) కు. ఇప్పటికే ఆమె మనీ లాండరింగ్ కేసును ఎదుర్కొంటున్నారు. విచారణ కొనసాగుతోంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తనతో పాటు నోరా ఫతేహీని ఇరికించింది. ఆమెకు కూడా ఇందులో భాగం ఉందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థకు తెలియ చేసింది.
అయితే రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే సుకేశ్ చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసింది. ఈ తరుణంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తనపై తప్పుడు ఆరోపణలు చేసిందంటూ నోరా ఫతేహి సంచలన ఆరోపణలు చేసింది. ఆపై తన పరువుకు భంగం కలిగించేలా నిరాధారమైన విమర్శలు చేసినందుకు తనకు పరువు నష్టం చెల్లించాలంటూ ముద్దుగుమ్మ నోరా ఫతేహీ కోర్టు మెట్లు ఎక్కింది.
దీంతో ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య వివాదం మరింత ముదిరింది. ఇదిలా ఉండగా నోరా ఫతేహీ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై జనవరి 25న కోర్టు విచారణ చేపట్టనుంది. అప్పటి వరకు కోర్టు ఏం తీర్పు చెబుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది బాలీవుడ్ సర్కిల్ లో. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
విచిత్రం ఏమిటంటే ఇద్దరూ ఇప్పుడు టాప్ హీరోయిన్ల జాబితాలో కొనసాగుతున్నారు. కానీ మనీ లాండరింగ్ కేసు ఇద్దరినీ నిద్ర పోనీయకుండా చేస్తోంది. ఈ మేరకు శనివారం ఢిల్లీ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. నోరా ఫతేహి పరువు నష్టం కేసును జాబితా చేసినట్లు స్పష్టం చేసింది. సుఖేశ్ చంద్ర శేఖర్ నుండి తనతో పాటు నోరా కూడా ఖరీదైన బహుమతులు తీసుకుందని ఆరోపించింది జాక్వెలిన్.
Also Read : విజయ్ మూవీ వసూళ్ల సునామి