Kamal Nath : మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక – క‌మ‌ల్ నాథ్

ప్ర‌క‌టించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ కాంగ్రెస్

Kamal Nath : మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది. అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌తిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా ఈసారి ఎలాగైనా స‌రే రాష్ట్రంలో ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. దిగ్విజ‌య్ సింగ్ , క‌మ‌ల్ నాథ్ లు పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్టారు.

ఈ సంద‌ర్భంగా మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్(Kamal Nath)  కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ప్ర‌త్యేకంగా మహిళ‌ల‌కు సంబంధించి మ్యానిఫెస్టోను విడుద‌ల చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు పార్టీ నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు. ప్రియ‌ద‌ర్శిని మ‌హిళ‌ల‌కు మ్యానిఫెస్టో ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్. అదే స‌మ‌యంలో ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా విడుద‌ల చేస్తామ‌న్నారు.

వివిధ వ‌ర్గాల‌కు సంబంధించిన ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా అద్బుత‌మైన మ్యానిఫెస్టోను తయారు చేసే ప‌నిలో ఉన్నామ‌ని చెప్పారు. సంబంధిత స‌మాచారాన్ని స‌మ‌ర్పించేందుకు 10 స‌బ్ క‌మిటీల‌ను ఇప్ప‌టికే ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. ఈ మ‌హిళ‌ల కోసం త‌యారు చేసే మ్యానిఫెస్టోకు ప్రియద‌ర్శిని అని పేరు పెట్ట‌డం జ‌రిగింద‌ని తెలిపారు మాజీ సీఎం క‌మ‌ల్ నాథ్(Kamal Nath) .

ఈ ఏడాది చివ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున మ‌హిళ‌ల‌కు ప్ర‌యారిటీ ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర యూనిట్ చీఫ్ క‌మ‌ల్ నాథ్ అధ్య‌క్ష‌త‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఈ విష‌యాన్ని వ‌చ‌న ప‌త్ర అడ్వైజ‌రీ క‌మిటీ చైర్మ‌న్ రాజేంద్ర సింగ్ వెల్ల‌డించారు.

Also Read : విచార‌ణ అయ్యేంత దాకా అన్నీ బంద్

Leave A Reply

Your Email Id will not be published!