Mohammed Shami : ఆ ఒక్క‌టి మార్చుకుంటే నువ్వు తోపు

ఉమ్రాన్ మాలిక్ పై మ‌హ్మ‌ద్ ష‌మీ కామెంట్స్

Mohammed Shami : ప్ర‌పంచ క్రికెట్ లో ఇప్పుడు కొత్త పేరు ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఎవ‌రా స్పీడ్ బౌల‌ర్ అని అనుకుంటున్నారా జ‌మ్మూ కాశ్మీర్ కు చెందిన స్పీడ్ స్ట‌ర్ గా పేరొందిన ఉమ్రాన్ మాలిక్. అత‌డిని ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ లో స‌న్ రైజ‌ర్స్ మేనేజ్ మెంట్ ప‌నిగ‌ట్టుకుని తీసుకుంది. ఆ త‌ర్వాత మ‌నోడి స్పీడ్ కు అడ్డు లేకుండా పోయింది.

ఏకంగా 150 కిలోమీట‌ర్ల స్పీడ్ తో బంతులు విస‌ర‌డంతో దెబ్బ‌కు ప్ర‌త్య‌ర్థులు జంకుతున్నారు. అంతే కాదు మైదానంలోకి రావాలన్నా, ఆడాల‌న్నా భయ‌ప‌డుతున్నారు. ఎప్పుడు ఎలా త‌మ పైకి బంతులు వ‌స్తాయోన‌ని ఆందోళ‌న చెందుతున్నారు. నిప్పులు చెరిగే బంతుల్ని విసురుతూ ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నాడు ఉమ్రాన్ మాలిక్ .

వ‌ర‌ల్డ్ వైడ్ గా ఇద్ద‌రి పేర్లు భార‌త జ‌ట్టు నుంచి ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఒక‌రు సూర్య కుమార్ యాద‌వ్ అలియాస్ సూర్య భాయ్ అయితే మ‌రొక‌రు జ‌మ్మూ కాశ్మీర్ స్టార్ పేస‌ర్ ఉమ్రాన్ మాలిక్. ఈ ఇద్ద‌రిపై ప్ర‌శంస‌లు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా మ‌రో ఫాస్ట్ బౌల‌ర్, కోల్ క‌తాకు చెందిన మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

రాబోయే రోజుల్లో యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచం గ‌ర్వ‌ప‌డేలా ఉమ్రాన్ మాలిక్ అవ‌త‌రించ బోతున్నాడ‌ని జోష్యం చెప్పాడు. అంతే కాదు కంటిన్యూగా ఉంటూ టాప్ లో దూసుకు పోవాలంటే ఒక్క‌టి మాత్రం మార్చు కోవాల‌ని సూచించాడు మాలిక్ కు ష‌మీ(Mohammed Shami).

అంతా బాగుంది కానీ లైన్ అండ్ లెంగ్త్ పై ఫోక‌స్ పెడితే చాలు ఇక ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌ర్చ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నాడు. ఇద్ద‌రితో క‌లిసి సాగించిన సంభాష‌ణ‌ను ప్ర‌స్తుతం బీసీసీఐ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. ఇది వైర‌ల్ గా మారింది.

Also Read : వీస్ దెబ్బకు భార‌త్ ఔట్

Leave A Reply

Your Email Id will not be published!