Jeff Bezos Washington Post : అమ్మకానికి వాషింగ్టన్ పోస్ట్
స్పష్టం చేసిన జెఫ్ బెజోస్
Jeff Bezos Washington Post : అమెజాన్ చైర్మన్ జెఫ్ బెజోస్ వాషింగ్టన్ పోస్ట్ ను విక్రయించనున్నారా. అవుననే అంటోంది అమెరికాకు చెందిన న్యూయార్క్ పోస్ట్. ఈ మేరకు కీలక కథనాన్ని ప్రచురించింది. ఎన్ఎఫ్ఎల్ కమాండర్ లను కొనుగోలు చేసేందుకు వాషింగ్టన్ పోస్ట్ ను విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఫుట్ బాల్ జట్టు కోసం అమెరికన్ వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ ను అమ్మకానికి పెట్టారు జెఫ్ బెజోస్. కాగా అనేక మీడియాలలో వచ్చిన నివేదకలను కొట్టి పారేశారు జెఫ్ బెజోస్ ప్రతినిధి. న్యూస్ కార్ప్ న్యూయార్క్ పోస్ట్ ను కూడా కలిగి ఉంది. ఇదిలా ఉండగా బెజోస్ వాషింగ్టన్ పోస్ట్(Jeff Bezos Washington Post) ను 2013లో $250 మిలియన్లకు కొనుగోలు చేశాడు.
డాన్ స్నైడర్ నుండి పొందేందుకు మార్గాన్ని క్లియర్ చేసేందుకు చూస్తున్నాడని న్యూయ్యార్క్ పోస్ట్ తెలిపింది. 1983, 1988 ,1992లో లోంబార్టి ట్రోఫీని కైవసం చేసుకుంది కమాండర్ ఫుట్ బాల్ టీం. బెజోస్ దీని దెబ్బకు వాషింగ్టన్ పోస్ట్ ను విక్రయించడం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వ్యాపారం, సంస్కృతిపై క్రీడల ప్రభావాన్ని కవర్ చేసే మల్టీ ప్లాట్ ఫారమ్ మీడియా బ్రాండ్ ఫ్రంట్ ఆఫీస్ స్పోర్ట్స్ , కమాండర్ లను వేలం వేసేందుకు స్పైడర్ నియమంచబడిన బ్యాంక్ ఆఫ్ అమెరికా కొనసాగించేలా చూస్తుంది.
ఇక వార్తా పత్రికను సొంతం చేసుకోవడం తన లక్ష్యం కాదని జెఫ్ బెజోస్ బహిరంగంగా ప్రకటించాడు. ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు , ఆన్ లైన్ విస్తరణను ప్రోత్సహించేందుకు బెజోస్ ను 2013లో దాని యజమాని డోనాల్డ్ గ్రాహం వాషింగ్టన్ పోస్ట్ ను కొనుగోలు చేసేలా ఒప్పించాడు.
Also Read : మోడీ బీబీసీ డాక్యుమెంటరీపై నో కామెంట్