Chandrababu Tarakaratna : తారక‌ర‌త్న ఆరోగ్యంపై బాబు ఆరా

హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో టీడీపీ చీఫ్

Chandrababu Tarakaratna : బెంగ‌ళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న తార‌క్ ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి పై ఆరా తీశారు తెలుగుదేశం పార్టీ జాతీయ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. ఇప్ప‌టికే న‌టులు క‌ళ్యాణ్ రామ్ , జూనియ‌ర్ ఎన్టీఆర్ బెంగ‌ళూరుకు చేరుకున్నారు. వారికి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి.

అక్క‌డి నుంచి నేరుగా హృద‌యాల‌య ఆస్ప‌త్రికి చేరుకున్నారు. వారితో పాటు నారా లోకేష్ భార్య , నంద‌మూరి బాల‌కృష్ణ కూతురు నారా బ్రాహ్మ‌ణి కూడా విచ్చేశారు. ఆస్ప‌త్రి వైద్యుల‌తో మాట్లాడారు. అక్క‌డికి నారా చంద్ర‌బాబు నాయుడు చేరుకుని తార‌క‌ర‌త్న(Chandrababu Tarakaratna) ఆరోగ్యం ఎలా ఉందంటూ వాక‌బు చేశారు. ఇంకా న‌టుడు తార‌క‌ర‌త్న కోమాలోనే ఉన్నారు.

ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగానే ఉన్నప్ప‌టికీ తార‌క‌ర‌త్న ఆరోగ్యంగానే ఉన్నార‌ని, త‌న కొడుక్కి ఏమీ కాద‌ని, త్వ‌ర‌లోనే కోలుకుంటాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున ఆస్ప‌త్రి వద్ద‌కు చేరుకున్నారు. తార‌క‌త‌ర్న త్వ‌ర‌గా కోలుకోలేని ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా తార‌క‌ర‌త్న బంధువు నంద‌మూరి చైత‌న్య కృష్ణ మీడియాతో మాట్లాడారు. ఇంకా విష‌మంగానే ఉంద‌ని సోమ‌వారం దాకా ఏమీ చెప్ప‌లేమ‌న్నారు. అప్ డేట్ కోసం అప్ప‌టి దాకా వేచి ఉండాల‌ని వైద్యులు తెలిపార‌ని చెప్పారు.

దివంగ‌త ఎన్టీఆర్ కు మ‌న‌వ‌డు తార‌క‌ర‌త్న‌. 2003లో కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఒక‌టో నంబ‌ర్ కుర్రాడు సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

2009లో అమ‌రావ‌తిలో ప్ర‌తికూల పాత్ర‌లు పోషించాడు. ప్ర‌స్తుతం వెబ్ సీరీస్ లో న‌టిస్తున్నారు తార‌క‌ర‌త్న‌.

Also Read : క‌ళ్యాణ్ రామ్..జూనియ‌ర్ ఎన్టీఆర్ ప‌రామ‌ర్శ‌

Leave A Reply

Your Email Id will not be published!