Shafali Verma Emotional : ఘన విజయం షఫాలీ భావోద్వేగం
అండర్ 19 ఐసీసీ వరల్డ్ కప్ విజయం
Shafali Verma Emotional : ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును స్వంతం చేసుకుంది అండర్ 19 భారత క్రికెట్ జట్టు. తొలి సారిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీని నిర్వహించింది. ఈ ఏడాది భారత క్రికెట్ రంగంలో అరుదైన ఘనత సాధించేలా కృషి చేశారు మన అమ్మాయిలు. ఇప్పటికే మహిళా జట్టు కీలక విజయాలను నమోదు చేసింది.
మరో వైపు బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళా ఐపీఎల్ ను నిర్వహిస్తోంది. ఏకంగా రూ. 4,668 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 మహిళా ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఇంగ్లండ్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి ఘన విజయాన్ని నమోదు చేసింది టీమిండియా.
ఈ సందర్భంగా కప్ గెలుచుకున్న అనంతరం భారత మహిళా జట్టు కెప్టెన్ షఫాలీ వర్మ మీడియాతో మాట్లాడారు. విజయాన్ని తట్టుకోలేక కంటతడి పెట్టారు షఫాలీ వర్మ(Shafali Verma Emotional) . భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కి ధన్యవాదాలు తెలిపారు టీమిండియా కెప్టెన్. అద్భుతమైన జట్టును అందించినందుకు కృతజ్ఞతలు పేర్కొన్నారు.
మహిళల విభాగంలో ఇప్పటి వరకు భారత జట్టు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదు. ఈ విజయంతో ఆ లోటు తీరినట్లయింది. మాట్లాడుతుండగానే కన్నీళ్లు ఆపుకోలేక పోయారు. మాకు అన్ని విధాలుగా బీసీసీఐ అండగా నిలిచింది. జట్టులోని ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా ఆడారని కితాబు ఇచ్చారు. సిబ్బందికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పింది షిఫాలీ వర్మ.
Also Read : భారత మహిళా జట్టు డ్యాన్స్ అదుర్స్