Kapil Dev Rishabh Pant : పంత్ లేని లోటు క‌నిపిస్తోంది – క‌పిల్

క‌నిపిస్తే కొట్టాల‌ని అనిపిస్తోంది

Kapil Dev Rishabh Pant : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ క‌పిల్ దేవ్ నిఖంజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిల‌క‌డ‌గా ఆడే రిష‌బ్ పంత్ లేక పోవ‌డం ఒకింత ఇబ్బందిక‌రంగా మారింద‌న్నాడు. స్వ‌దేశంలో భార‌త జ‌ట్టు ఆసిస్ తో నాలుగు టెస్టులు , మూడు వ‌న్డే సీరీస్ లు ఆడ‌నుంది.

ఈ సంద‌ర్బంగా అనవ‌స‌రంగా డ్రైవింగ్ చేస్తూ కారు ప్ర‌మాదానికి గుర‌య్యాడు రిషబ్ పంత్ ఇటీవ‌ల‌. దీంతో అత‌డిని చికిత్స నిమిత్తం ముంబైకి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆప‌రేష‌న్ పూర్త‌యింది. మెల మెల్ల‌గా కోలుకుంటున్నాడు.

ఇదే విష‌యాన్ని రిష‌బ్ పంత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు. తాను త్వ‌ర‌లోనే మైదానంలోకి వ‌స్తాన‌ని అభిమానుల ఆద‌రాభిమానాలు త‌న‌ను తిరిగి బ‌తికించాయ‌ని పేర్కొన్నాడు. ఈ సంద‌ర్బంగా త‌న ఆరోగ్యం బాగుండాల‌ని కోరిన ప్ర‌తి ఒక్క‌రికీ తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశాడు రిష‌బ్ పంత్.

మ‌రో వైపు క‌పిల్ దేవ్(Kapil Dev Rishabh Pant) సీరియ‌స్ గా స్పందించాడు పంత్ ఆరోగ్యంపై. తాను కూడా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాన‌ని, కానీ బాగా అయ్యాక వ‌చ్చాక చెంప ఛెళ్లుమ‌నిపిస్తాన‌ని పేర్కొన్నాడు.

ఎందుకంటే లైఫ్ అనేది ఒక్క‌సారే వ‌స్తుంద‌ని ఏ మాత్రం అజాగ్ర‌త్త‌తో ఉన్నా అస‌లైన కెరీర్ పై దెబ్బ ప‌డుతుంద‌ని హెచ్చ‌రించాడు క‌పిల్ దేవ్. ఇక నుంచైనా ఇలాంటి దుందుడుకు చ‌ర్య‌ల‌కు పోకుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని సూచించాడు హ‌ర్యానా హ‌రికేన్. టెస్టుల్లో పంత్ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపోస్తందంటూ కామెంట్ చేశాడు. మ‌రో వైపు పంత్ త్వ‌ర‌గా కోలుకోవ‌డం ప‌ట్ల బీసీసీఐ సంతోషం వ్య‌క్తం చేస్తోంది.

Also Read : తొలి టెస్టుకు భార‌త్..ఆసిస్ రె’ఢీ’

Leave A Reply

Your Email Id will not be published!