INDW vs WIW T20 World Cup : భారత్ విండీస్ బిగ్ ఫైట్
స్మృతి మంధాన ఆడనుందా
INDW vs WIW T20 World Cup : దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ లో ఇవాళ వెస్టిండీస్ తో భారత మహిళా జట్టు ఆడనుంది. దాయాది పాకిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ విక్టరీ సాధించింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ తరుణంలో రెండో మ్యాచ్ వెస్టిండీస్ తో జరగనుంది.
ఇప్పటికే శ్రీలంక రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. జెమీమా, షెఫాలీ వర్మ అద్బుతంగా ఆడారు. ప్రస్తుతం విండీస్ తో జరిగే కీలక మ్యాచ్ లో స్మృతీ మంధాన ఆడనుందా(INDW vs WIW T20 World Cup) లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే చేతి వేలికి గాయం కావడంతో ఆమె పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ నుంచి తప్పుకుంది.
పాకిస్తాన్ తో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించాక మంచి ఊపు మీదుంది హర్మన్ ప్రీత్ కౌర్ సేన. ఇక తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ తో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది విండీస్ . ఇక కరేబియన్ తో జరిగే మ్యాచ్ లో భారత్ గెలుపొంది గ్రూప్ -బిలో టాప్ బెర్త్ కు చేరుకోవాలని ఉబలాట పడుతోంది భారత జట్టు.
భారత్ 2 పాయింట్లతో జాబితాలో 2వ స్థానంలో ఉంది. ఇంగ్లండ్ టాప్ లో ఉంది. మంధాన ఫిట్ అని తేలితే ఆడుతుంది లేక పోతే ఆమెకు బదులు భాటియాను భర్తీ చేయనున్నారు. మంధాన లేదా భాటియా, షెఫాలీ వర్మ, జెమీమా , హర్మన్ ప్రీత్ కౌర్ , రిచా ఘోష్ , హర్లీన్ డియోల్ , పూజా వస్త్రాకర్ , దీప్తి శర్మ, రాధా యాదవ్ , రాజేశ్వరి గైక్వాడ్ , రేణుకా సింగ్ ఆడనున్నారు.
Also Read : ఆర్సీబీ మెంటార్ గా సానియా మీర్జా