ANI Support BJP : బీజేపీ సేవలో ఏఎన్ఐ
ఈయూ డిస్ ఇన్ఫో ల్యాబ్
ANI Support BJP : ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) పేరుతో వచ్చేవన్నీ ఫేక్ వార్తలంటూ సంచలన ఆరోపణలు చేసింది ఈయూ డిస్ ఇన్ఫో ల్యాబ్. 2019 ఎన్నికల నాటి నుంచి పూర్తిగా బీజేపీ కోసం పని చేస్తోందంటూ మండి పడింది. కల్పిత వార్తలకు, కట్టుకథలకు ఏఎన్ఐ మారి పోయిందని ఆరోపించింది.
ఏఎన్ఐ తరచుగా ప్రస్తావిస్తున్న మేధో సంస్థలు కానీ జర్నలిస్టులు కానీ లేరని పేర్కొంది. పక్కా ప్లాన్ ప్రకారం మోదీ పరివారానికి సపోర్ట్ చేస్తున్నదని దానిని నమ్మాల్సిన పని లేదని పేర్కొంది. ఏఎన్ఐ ఇచ్చే ప్రతి వార్త బీజేపీకి అనుకూలంగా(ANI Support BJP) ఉందని ఆరోపించింది.
లేని సంస్థలను ఉన్నట్లు చూపించడం ఇందులో భాగమేనని పేర్కొంది. ప్రధాని మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా , తదితర నాయకులు కేవలం ఏఎన్ఐకి మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారంటూ ప్రశ్నించింది..
ఇదిలా ఉండగా ఏషియా ఫిల్మ్స్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 1971లో స్టార్ట్ అయ్యింది. 1990లో అది ఏఎన్ఐ గా మారింది. రాయిటర్స్ కు 2022 దాకా వాటా ఉండేది. తర్వాత తగ్గించుకుంది. ఇక ఏఎన్ఐలో(ANI Support BJP) ఏ వార్త వచ్చినా వాటిని ఉన్నది ఉన్నట్లు దేశంలోని మీడియా సంస్థలు వాడేసుకోవడం విస్తు పోయేలా చేసింది.
వాటిలో ప్రముఖమైనవి ఎక్కువగా ఉండడం గమనార్హం. బిజినెస్ స్టాండర్డ్ ,ది ప్రింట్ , న్యూస్ 18, సీఎన్ఎన్ , ఇండియా టుడే గ్రూప్ , రిపబ్లిక్ టీవీ, ఏబీపీ గ్రూప్ , టైమ్స్ , జీ గ్రూప్స్ , ఇండియన్ ఎక్స్ ప్రెస్ , ఎన్డీటీవీ, క్వింట్ , స్కోల్ , ఫస్ట్ పోస్ట్ , లైవ్ మింట్ , హిందూస్తాన్ , హిందూ, దెక్కన్ హెరాల్డ్ , టెలిగ్రాఫ్ , డీఎన్ఏ, ట్రిబ్యూన్ , జాగరన్ , దైనిక్ భాస్కర్ , అమర్ ఉజాలా , నవభారత్ టైమ్స్ ఉన్నాయి.
Also Read : ఆప్ బీజేపీ సభ్యుల మధ్య తోపులాట