Ravi Shastri KL Rahul : కేఎల్ రాహుల్ కంటే గిల్ బెట‌ర్

మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి కామెంట్

Ravi Shastri KL Rahul : భార‌త జ‌ట్టు మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి నిప్పులు చెరిగాడు. కేఎల్ రాహుల్ ను టార్గెట్ చేశాడు. గ‌త కొంత కాలంగా పేల‌వ‌మైన ఆట తీరుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. మాజీ క్రికెట‌ర్ వెంక‌టేశ్ ప్ర‌సాద్ అయితే ఐపీఎల్ లో ల‌క్నో జెయింట్స్ కు సార‌థ్యం వ‌హించ‌డం వ‌ల్ల‌నే జ‌ట్టులో కంటిన్యూగా కొన‌సాగుతూ వ‌స్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.

దేశంలో ఎంతో మంది ప్ర‌తిభ క‌లిగిన ఆట‌గాళ్లు ఉన్నా ఎందుక‌ని ఆడ‌కున్నా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేస్తున్నారంటూ ప్ర‌శ్నించాడు. భార‌త సెలెక్ష‌న్ క‌మిటీలో ఫెవ‌రిటిజం కొనసాగుతోందంటూ బాంబు పేల్చాడు. వ‌రుసగా వైఫ‌ల్యం చెందుతున్నా, ప‌రుగులు చేయ‌క పోయినా జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కేఎల్ రాహుల్ ను కంటిన్యూ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడు ర‌విశాస్త్రి(Ravi Shastri KL Rahul) . ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నాడు. వైస్ కెప్టెన్ ను ఎంపిక చేయ‌లేదంటూ ప్ర‌శ్నించాడు బీసీసీఐని.

భ‌ర్తీ చేయక పోవ‌డం నిర్ల‌క్ష్యాన్ని, బాధ్య‌తా రాహిత్యాన్ని సూచిస్తుంద‌న్నాడు ర‌విశాస్త్రి. ఇదిలా ఉండగా కేఎల్ రాహుల్ త‌న చివ‌రి ఏడు ఇన్నింగ్స్ లలో 22, 23, 10, 2, 20, 17, 1 ర‌న్స్ చేశాడు. ఏడు ఇన్నింగ్స్ ల‌లో కేవ‌లం 95 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. మ‌రో వైపు శుభ్ మ‌న్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నా ప‌ట్టించు కోవ‌డం లేదు. ఇప్ప‌టికైనా జ‌ట్టు మేనేజ్ మెంట్ వెంట‌నే కేఎల్ రాహుల్ ను(KL Rahul) తొల‌గించి శుభ్ మ‌న్ ను ఎంపిక చేయాల‌ని సూచించాడు ర‌విశాస్త్రి.

Also Read : ఆస్ట్రేలియా అరుదైన రికార్డ్

Leave A Reply

Your Email Id will not be published!