Usama Mir Record : పాక్ స్టార్ ఉసామా ఊచ‌కోత

ఒక్క ఓవ‌ర్ లో 6,6,6,6,4,6

Usama Mir Record : పాకిస్తాన్ స్టార్ ఉసామా మీర్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. ఏకంగా ఒకే ఒక్క ఓవ‌ర్ లో 34 ర‌న్స్ చేశాడు. క‌ళ్లు చెదిరేలా సిక్స‌ర్లు బాదాడు. పాకిస్తాన్ లోని ఘ‌నీ రంజాన్ టోర్నీలో భాగంగా జ‌రిగిన మ్యాచ్ లో ఐదు సిక్స‌ర్ల‌తో పాటు ఒక ఫోర్ కొట్టాడు.

ముల్తాన్ సుల్తాన్స్ ఫ్రాంచైజీలో భాగంగా పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్) లో ఆడుతున్నాడు. కేవ‌లం 20 బంతులు ఎదుర్కొన్న ఉసామా మీర్(Usama Mir Record) ఏకంగా 66 ర‌న్స్ చేశాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఉసామా ఊచ‌కోత కోశాడు. ప్ర‌త్య‌ర్థులకు చుక్క‌లు చూపించాడు.

పాకిస్తాన్ క్రికెట్ క్యాలెండ‌ర్ లో రెగ్యుల‌ర్ గా మారిన ఈ టోర్నీలో జీఐసీ , క‌రాచీ వారియ‌ర్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో ఈ షాన్ దార్ ఇన్నింగ్స్ జ‌రిగింది. ఈ టోర్నీ రంజాన్ నెల‌లో ప్ర‌తి ఏటా నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. పోటీలో ప్ర‌తి జ‌ట్టుకు ఇద్ద‌రు అంత‌ర్జాతీయ ఆట‌గాళ్ల‌తో ఎనిమిది జ‌ట్లు పాల్గొంటున్నాయి.

ఉసామా మీర్ ఘ‌నీ ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ (జీఐసీ) త‌ర‌పున ఉసామా మీర్ (Usama Mir) ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. 66 ప‌రుగుల‌తో కీల‌కంగా మారాడు. 6 వికెట్లు కోల్పోయి 236 ర‌న్స్ చేయ‌డంలో మీర్ ముఖ్య భూమిక పోషించాడు.

ఇక పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో యువ ఆట‌గాళ్లు రాణిస్తున్నారు. త‌మ‌దైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఉసామా మీర్ చేసిన ఈ ర‌న్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Also Read : రెచ్చి పోయిన కైల్ మేయ‌ర్స్

Leave A Reply

Your Email Id will not be published!