Mayawati : సమాజ్ వాదీ పార్టీ ప‌ట్ల జ‌ర భద్రం

బీఎస్పీ చీఫ్ , మాజీ సీఎం మాయావ‌తి

Mayawati : స‌మాజ్ వాది పార్టీపై తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు బీఎస్పీ చీఫ్ , మాజీ సీఎం మాయావ‌తి(Mayawati). ద‌ళితులు, ఓబీసీలు, ముస్లింలు ఆ పార్టీ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు. సీఎం అయిన త‌ర్వాత కూడా దివంగ‌త ములాయం సింగ్ యాద‌వ్ ఉద్దేశాలు స్వ‌చ్చంగా లేవ‌న్నారు. బీఎస్పీ ప‌రువు తీయ‌డం, ద‌ళితుల అణ‌చివేత‌ను కొన‌సాగించ‌డ‌మేన‌ని ఆరోపించారు.

బ‌హుజనులు ఓటు బ్యాంకుగా మార‌డం బాధాక‌ర‌మ‌న్నారు. అభివృద్ది, ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌కు బ‌దులు స‌మాజ్ వాదీ పార్టీ కుల రాజ‌కీయాలు చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బుధ‌వారం మాయావ‌తి మీడియాతో మాట్లాడారు. ద‌ళిత‌, ఓబీసీ, ముస్లిం వ‌ర్గాలు నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రూపొందించిన రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షించ‌డం కోసం త‌మ పార్టీ కృషి చేస్తోంద‌ని, ఆ దిశ‌గా అన్ని పార్టీల‌ను ఏకం చేస్తోందంటూ మాజీ సీఎం , ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై తీవ్ర స్థాయిలో ఖండించారు మాయావ‌తి. 1984లో స్థాపించిన బీఎస్పీ బ‌హుజ‌నుల కోసం ప‌ని చేస్తుంద‌న్నారు. ఎస్పీ చీఫ్ స‌మ‌క్షంలో మిలే ములాయం కాన్షీరాం హ‌వా హో గ‌యే జై శ్రీ‌రాం నినాదం ఆ మ‌ధ్య‌న హ‌ల్ చ‌ల్ చేసింది.

ప్ర‌స్తుతం స‌మాజ్ వాదీ పార్టీని బ‌హుజ‌నులు న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌న్నారు మాయావ‌తి. మాన్య‌శ్రీ కాన్షీరాం ను ఆ పార్టీ ఏనాడో మ‌రిచి పోయింద‌న్నారు.

Also Read : ఆర్ఎస్ఎస్..గాడ్సే భాగాలు తొల‌గింపు

Leave A Reply

Your Email Id will not be published!