Uddhav Thackeray : హోం మంత్రిగా ఫ‌డ్న‌వీస్ ఫెయిల్

నిప్పులు చెరిగిన విప‌క్షాలు

Uddhav Thackeray : మ‌హారాష్ట్ర‌లో శాంతి భ‌ద్ర‌త‌లు అధ్వాన్నంగా ఉన్నాయ‌ని, రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోందంటూ శివ‌సేన యూబీటీ ఆరోపించింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని 11 ప్రాంతాల పేర్ల‌ను చైనా మార్చేసినా ఈరోజు వ‌ర‌కు కేంద్ర స‌ర్కార్ ఎందుకు మౌనంగా ఉందంటూ ప్ర‌శ్నించింది.

ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ శివ‌సేన మౌత్ పీస్ ప‌త్రిక సామ్నా సంపాద‌కీయంలో ప్ర‌స్తావించింది. ఇది పూర్తిగా చేత‌కానిత‌నం తెలియ చేస్తోంద‌ని పేర్కొంది. నిత్యం ప్ర‌గ‌ల్భాలు ప‌లికే మోదీ ఏం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించింది. ధైర్యంగా ఎదుర్కొనే స్థైర్యం భార‌త్ కు లేదా అని నిల‌దీసింది.

ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, సీఎం, డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారో అర్థం కావ‌డం లేదంటూ ఎద్దేవా చేసింది శివ‌సేన యూబీటీ. మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే(Uddhav Thackeray) ఎలాంటి విలువ లేని నాయ‌కుడిగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ను అభివ‌ర్ణించారు. పాకిస్తాన్ ను బెదిరిస్తూ వ‌స్తున్నారే త‌ప్పా చైనాను ఎందుకు నిలువ‌రించ లేక పోతున్నారంటూ నిల‌దీశారు.

ఉద్ద‌వ్ థాక్రే వ‌ర్గానికి చెందిన మ‌హిళా కార్య‌క‌ర్త‌పై థానేలో శివ‌సేన కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది అరాచకానికి ప‌రాకాష్ట అని పేర్కొన్నారు. బ‌ల‌హీన‌మైన వ్య‌క్తి సీఎంగా ఉన్నంత కాలం ఇలాగే పాల‌న సాగుతుంద‌న్నారు.

Also Read : రాహుల్ దేశానికి మ‌హాత్మా గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!