Anil K Antony : బీజేపీలో చేర‌నున్న అనిల్ ఆంటోనీ

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఏకే ఆంటోనీ కొడుకు

Anil K Antony : ఎట్ట‌కేల‌కు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ. తాను త్వ‌ర‌లోనే భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశారు.

2002లో చోటు చేసుకున్న గుజ‌రాత్ అల్ల‌ర్ల‌కు సంబంధించి బీబీసీ ప్ర‌సారం చేసిన డాక్యుమెంట‌రీపై కాంగ్రెస్ పార్టీ కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఆ వెంట‌నే తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆయ‌న పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్నారు.

అనిల్ ఆంటోనీ(Anil K Antony)  పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీకి తీర‌ని న‌ష్టం వాటిల్ల‌నుంది. 2007లో కాలేజ్ ఆఫ్ ఇంజ‌నీరింగ్ చేశారు. యుఎస్ లోని స్టాన్ ఫోర్డ్ విశ్వ విద్యాల‌యం నుండి మేనేజ్ మెంట్ సైన్స్ అండ్ ఇంజ‌నీరింగ్ లో మాస్ట‌ర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు.

ఆయ‌న పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా అనిల్ ఆంటోనీ ట్వీట్ చేశారు. వాక్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారి అస‌హ‌న‌పు కాల్స్ ను ఉటంకించారు. హిపోక్ర‌సీ నీ పేరు జీవితం కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు.

అనిల్ ఆంటోనీ టెక్ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉన్నారు. యుఎస్ లోని మెర్సిడ్ , కాలిఫోర్నియా యూనివ‌ర్శిటీ లోని మేనేజ్ మెంట్ స్కూల్ లో స‌ల‌హాదారుల బోర్డు స‌భ్యుడు. సిస్కో, టార్క్ , కాస్ప‌ర్ ల్యాబ్స్ తో స‌హా ప‌లు బ‌హుళ‌జాతి కంపెనీల‌లో ప‌ని చేశారు. పీఐ ఇండియాలో స‌హ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఉన్నారు అనిల్ ఆంటోనీ.

Also Read : సీఎం ఎవ‌ర‌నేది హైక‌మాండ్ తేలుస్తుంది

Leave A Reply

Your Email Id will not be published!