Asaduddin Owaisi : గాడ్సేపై ఓవైసీ షాకింగ్ కామెంట్స్
ఫోటో పెట్టుకుని డ్యాన్సులు చేస్తారా
Asaduddin Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గాంధీని చంపిన గాడ్సేపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా గాడ్సే చిత్ర పటాలను ప్రదర్శించినప్పుడు పోలీసులు, మీడియా ఎందుకు మౌనంగా ఉందంటూ ప్రశ్నించారు ఎంపీ. గాడ్సే చిత్రాలను ప్రదర్శిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరైనా ఒసామా బిన్ లాడెన్ బొమ్మను తగిలించుకుని ఉంటే పోలీసులు వాళ్ల ఇంటి తలుపులు తట్టే వారన్నారు. హైదరాబాద్ పోలీసులపై విరుచుకుపడ్డారు ఎంపీ ఓవైసీ.
హిందూ రాష్ట్రాన్ని చేస్తానని ఎవరో చెప్పారు. హైదరాబాద్ లో నాథురాం గాడ్సే ఫోటో పెట్టారు. అర్థం కావడం లేదు. భారత దేశపు తొలి ఉగ్రవాది గాంధీని చంపిన గాడ్సే అని, అతని ఫోటోతో డ్యాన్స్ చేస్తున్నారని, వీరంతా ఎవరు అని నిలదీశారు అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi). అతడితో మీకు ఉన్న సంబంధం ఏమిటో చెప్పాలని అన్నారు. టెలివిజన్ లో తమ భాయిజాన్ ఫోటో చూసినట్లుగా వారంతా మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు ఎంపీ.
బీహార్ లో ఓ మదర్సాకు నిప్పు పెట్టారు. రాష్ట్రంలో సెక్యులర్ సర్కార్ ఉంది. పార్టీ ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు మీరు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారని అంటున్నారు. మదర్సాకు నిప్పు పెడితే సీఎం నితీశ్ కుమార్ ఎందుకు మౌనంగా ఉన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఓవైసీ.
Also Read : కాంగ్రెస్ కు 130 సీట్లకు పైగా వస్తాయి