AP BJP Politics : సోము..న‌ల్లారి బిజీ బిజీ

మార‌నున్న ఏపీ బీజేపీ సీన్

AP BJP Politics : ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. ఉమ్మ‌డి ఏపీ రాష్ట్ర చివ‌రి సీఎం న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌డం ఆస‌క్తిని రేపుతోంది. మ‌రో వైపు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు ఢిల్లీలో న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి కీల‌క నేత‌ల‌తో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

రాష్ట్రంలో బ‌ల‌మైన వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఢీకొనాలంటే బీజేపీ(AP BJP Politics) మ‌రింత శ‌క్తివంతంగా కావాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, అడ‌పా ద‌డ‌పా ఆందోళ‌న‌లు త‌ప్పితే కింది స్థాయి నుంచి పార్టీని మ‌రింత చైత‌న్య‌వంతం చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

రాజ‌కీయంగా అంత దూకుడుగా ప్ర‌ద‌ర్శించ‌క పోయినా కిర‌ణ్ కుమార్ రెడ్డి వ్యూహాలు ప‌న్న‌డంలో దిట్ట‌. ఆయ‌న ఇప్ప‌టికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. స్వంతూరు చిత్తూరు జిల్లా. ప్ర‌భుత్వ విప్ గా ప‌ని చేశారు. సీఎంగా ఉన్నారు. త‌న వ‌ర్గానికి చెందిన వారిని, ఇత‌ర పార్టీల‌లో ఉన్న వారిని బీజేపీ వైపు మ‌ళ్లించేలా పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న వెంట విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి కూడా ఉన్నారు.

కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ , జి. కిష‌న్ రెడ్డితో పాటు పార్టీ చీఫ్ జేపీ న‌డ్డాను కూడా క‌ల‌వ‌డం మ‌రింత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇదే క్ర‌మంలో సోముకు ఫోన్ రావ‌డంతో ఆయ‌న హుటా హుటిన ఢిల్లీకి వెళ్లారు. 

అక్క‌డ సోముతో పాటు న‌ల్లారి క‌లిసి చ‌ర్చించ‌డం ఏదో జ‌ర‌గ‌బోతోంద‌న్న సంకేతం క‌లుగుతోంది. ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ పార్టీ బీజేపీది రెండూ ఒక‌టే జెండా అజెండా అని వెల్ల‌డించారు. పొత్తులుంటాయా లేక ఏదైనా జ‌ర‌గ‌బోతోందా అన్నది వేచి చూడాలి.

Also Read : బందీపూర్ టైగ‌ర్ రిజ‌ర్వ్ లో మోడీ సంద‌డి

Leave A Reply

Your Email Id will not be published!