DK Shivakumar Chopper : డీకే శివకుమార్ హెలికాప్టర్ తనిఖీ
ఈసీ అధికారుల తీరుపై కామెంట్స్
DK Shivakumar Chopper : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను శనివారం తనిఖీ చేశారు ఈసీ అధికారులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే శివకుమార్ దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలికి చేరుకున్నారు. ఆయన ప్రయాణం చేసిన హెలిప్యాడ్ ను(DK Shivakumar Chopper) క్షుణ్ణంగా తనిఖీ చేపట్టడం కలకలం రేపింది.
ఇక హెలికాప్టర్ ను పూర్తిగా తనిఖీ చేసినా ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఏమీ లభించక పోవడంతో ఈసీ ఆఫీసర్లు వెనుదిరిగారు. ఇదిలా ఉండగా తాను ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ ను తనిఖీ చేయడంపై తీవ్రంగా స్పందించారు డీకే శివకుమార్. వారి విధులు వారు నిర్వర్తించారని, ఇది ఎన్నికల సమయంలో షరా మూమూలేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందని , దీనిని తట్టుకోలేక కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై తనిఖీలు చేయాలని, తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అయితే తాను పోటీదారుగా ఉండడాన్ని సీఎం జీర్ణించుకోలేక పోతున్నారని , అడుగడుగునా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడంటూ మండిపడ్డారు.
Also Read : పంజాబ్ లో ఖలిస్తానీ వాదం లేదు – షా