CSK vs GT Qualifier1 : గుజరాత్ జోరు చెన్నై హుషారు
ఐపీఎల్ క్వాలిఫైయర్ -1 బిగ్ ఫైట్
CSK vs GT Qualifier1 : ఐపీఎల్ 16వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. 10 టీమ్ లు పాల్గొన్న ఈ టోర్నీలో నాలుగు టీమ్ లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. మంగళవారం దిగ్గజ టీమ్ లు తలపడనున్నాయి. వరుస విజయాలతో జోర్ మీదున్న హార్దిక్ పాండ్యా సేన బలమైన మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK) తో తలపడ బోతోంది.
పాయింట్ల పట్టికలో గుజరాత్ తొలి స్థానంలో నిలిచింది. 14 మ్యాచ్ లు ఆడి 10 మ్యాచ్ లలో గెలుపొందింది డిఫెండింగ్ ఛాంపియన్. 4 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. 20 పాయింట్లు సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును(RCB) ఓడించింది. అసాధారణ ఆట తీరుతో శుభ్ మన్ గిల్ దగ్గరుండి గెలిపించాడు. సెంచరీతో సత్తా చాటాడు.
ఇక చెన్నై సూపర్ కింగ్స్(CSK) 14 మ్యాచ్ లు ఆడింది. 8 మ్యాచ్ లలో గెలుపొందింది. 16 పాయింట్లు సాధించి 2వ స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ లో మొదటి మ్యాచ్ ఇవాళ జరగనుండడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు ఉత్కంఠతో.
జట్ల పరంగా చూస్తే గుజరాత్ టైటాన్స్(GT) జట్టుకు పాండ్యా కెప్టెన్. గిల్ , మంథర్ , అభిన్ మంధర్ , సామా, వేడ్ , రషీద్ ఖాన్ , రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్ , షమీ, జోసెఫ్ , యష్ దయాల్ , సాంగ్వాన్ , సల్కండే, జయంత్ యాదవ్ , సాయి కిషోర్ , నూర్ అహ్మద్ , విలియమ్సన్ , స్మిత్ , భరత్ , మావి, పటేల్ , జోష్ లిటిల్ , మోహిత్ శర్మ ఆడతారు.
చెన్నై సూపర్ కింగ్స్ కు ధోనీ కెప్టెన్ కాగా కాన్వే, రుతురాజ్ , రాయుడు, సేనాపతి, అలీ, దూబే, హంగ్రేకర్ , ప్రిటోరియస్ , సాంట్నర్ , జడేజా, దేశ్ పాండే , ముఖేశ్ , పతిరానా, సిమర్ జిత్ సింగ్ , దీపక్ చాహర్ , సోలంకి, మహేశ్ తీక్షణ, రహానే, బెన్ స్టోక్స్ , షేక్ రషీద్ ,సిద్దు, జామీసన్ ఆడతారు.
Also Read : Siddaramaiah Comment
