Avinash Reddy : సుప్రీంలో అవినాష్ కు చుక్కెదురు

బెయిల్ పిటిష‌న్ తిరస్క‌ర‌ణ

Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి(Avinash Reddy) కోలుకోలేని షాక్ త‌గిలింది. ముంద‌స్తు అరెస్ట్ చేయ‌కుండా త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ స‌ర్వోన్న‌త న్యాయ స్థానంను ఆశ్ర‌యించాడు. ఈ మేర‌కు ఇవాళ విచారించిన కోర్టు ధ‌ర్మాస‌నం బిగ్ షాక్ ఇచ్చింది. కుద‌ర‌దంటూ పిటిష‌న్ ను తిరస్క‌రించింది. ఇదే స‌మ‌యంలో దివంగ‌త మంత్రి వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి ఎలాంటి బెయిల్ ఇవ్వ‌వ‌ద్ద‌ని , వెంట‌నే అరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ దావా వేసింది. దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది.

ఇక ఈ కేసు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. దారుణ హ‌త్య‌కు గురైంది ఎవ‌రో కాదు సాక్షాత్తు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి స్వంత చిన్నాయ‌న‌. ఆయ‌న దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డికి స్వంత త‌మ్ముడు. ఇక తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి జ‌గ‌న్ కు ఆప్తుడు. దీంతో రాజ‌కీయం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే ఈ కేసు విచారిస్తున్న సీబీఐ ప‌లుమార్లు త‌మ వ‌ద్ద‌కు విచార‌ణ‌కు రావాల్సిందిగా కోరింది. ఈ మేర‌కు నోటీసులు కూడా ఇచ్చింది. కానీ అవినాష్ రెడ్డి త‌ప్పించుకుంటూ వ‌చ్చారు. ఏవో కార‌ణాలు చూపుతూ వాయిదా వేస్తూ వ‌చ్చారు.

తీరా చివ‌ర‌కు ఎంపీ తండ్రిని అరెస్ట్ చేశారు. జైల్లోకి తోశారు. ఇక మిగిలింది ఎంపీ అవినాష్ రెడ్డి మాత్ర‌మే. త‌న త‌ల్లికి బాగో లేద‌ని త‌న‌కు వీలు కాదంటూ తెలిపారు. క‌ర్నూలు ఆస్పత్రికి మార్చారు. ఆమెను వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి వైఎస్ విజ‌యమ్మ ప‌రామ‌ర్శించారు. మొత్తంగా అరెస్ట్ చేసేందుకు సీబీఐ స్పీడ్ పెంచితే అవినాష్ రెడ్డి మాత్రం కొంచెం వెసులుబాటు ఇవ్వాల‌ని కోరుతున్నారు. మొత్తంగా ఈ వ్య‌వ‌హారం సినిమాను త‌లపింప చేస్తోంది.

Also Read : Maleesha Kharwa Comment

Leave A Reply

Your Email Id will not be published!