Maleesha Kharwa Comment : స్ల‌మ్ గ‌ర్ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్

విస్తు పోయిన లోకం ఫ్యాష‌న్ ప్ర‌పంచం

Maleesha Kharwa Comment : స్ల‌మ్ డాగ్ సినిమా చూసి మురిసి పోయాం. ధార‌విని చూసి పేద‌రికం ఇలాగే ఉంటుందా అని ఆశ్చ‌ర్యానికి లోన‌య్యాం. కానీ మురికి వాడ‌ల్లోంచి కూడా మాణిక్యాలు ఉంటాయ‌ని నిరూపించింది మ‌లీషా ఖార్వా(Maleesha Kharwa). దేశ వ్యాప్తంగా ఈ అమ్మాయి గురించి చ‌ర్చిస్తోంది. సామాజిక మాధ్య‌మాల‌లో టాప్ లో , ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. ఇంత‌కీ ఈ అమ్మాయి చేసింది ఏమిటి. ఆమె వెనుక ఉన్న క‌థేమిటో తెలుసు కోవాలంటే దీనిని చ‌ద‌వాల్సిందే. ప్ర‌పంచ ఫ్యాష‌న్ రంగంలో మోస్ట్ పాపుల‌ర్ కంపెనీ ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ల‌ను కాద‌నుకుంది. కేవ‌లం మురికి వాడ‌ల్లో బ‌తుకుతున్న అమ్మాయిని ఎంపిక చేసింది. త‌న కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా. ఆమెకు ప‌ట్టుమ‌ని 14 ఏళ్లు. ఇప్పుడంతా స్ల‌మ్ గ‌ర్ల్ అని పిలుచుకుంటున్నారు. త‌నేమీ సిగ్గు ప‌డ‌డం లేదు. ఎందుకంటే తాను కూడా అక్క‌డి నుంచి వ‌చ్చాన‌ని తెలుసు.

దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ప్ర‌ముఖుల‌ను ఎంచుకుంటాయి. అంత‌కంటే ఎక్కువగా సినీ, క్రీడా రంగానికి చెందిన హీరోయిన్ల‌ను, క్రికెట‌ర్ల‌ను ఎంపిక చేసుకుంటాయి. కానీ ఫ్యాష‌న్ సంస్థ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. త‌మ‌కు బాలీవుడ్ , టాలీవుడ్, కోలీవుడ్ , శాండిల్ వుడ్ భామ‌లు వ‌ద్ద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టి చెప్పేసింది. అందం అన్న‌ది శ‌రీరానికి కానీ మ‌న‌సుకు కాద‌ని ప్ర‌క‌టించింది. ప్ర‌తి రోజూ లేచి న‌ప్ప‌టి నుంచి ప‌డుకేనేంత దాకా రోజ్ వాట‌ర్ నుంచి స‌బ్బుల దాకా ప్ర‌తిదీ వ్యాపారమే..వాణిజ్య‌మే..ప్ర‌క‌ట‌న‌ల‌తో హోరెత్తిస్తుంటాయి కంపెనీలు. పై దుస్తుల నుంచి లో దుస్తుల దాకా. కానీ స‌ద‌రు కంపెనీ అంద‌రినీ ప‌క్క‌న పెట్టేసింది. ముంబైలోని ధార‌వి మురికి వాడ‌కు చెందిన మ‌లీషా ఖ‌ర్వాను(Maleesha Kharwa) ఎంపిక చేసుకుంది. విచిత్రం ఏమిటంటే ఈ బాలిక‌ను మొద‌ట హాలీవుడ్ న‌టుడు రాబ‌ర్ట్ హాఫ్ మెన్ గుర్తించాడు. ఖ‌ర్వాకు సాయం చేసేందుకు గో ఫండ్ మీ అనే పేజీని కూడా క్రియేట్ చేశాడు.

ఆ త‌ర్వాత మ‌లీషా(Maleesha Kharwa) సోష‌ల్ మీడియాను ఆక‌ర్షించింది. ఆమె లోని స‌హ‌జ సౌంద‌ర్యం చూసి మోడ‌లింగ్ అసైమ‌న్ మెంట్స్ వ‌చ్చాయి. అంతే కాదు లివ్ యువ‌ర్ ఫెయిరీ టేల్ షార్ట్ ఫిలింలో కూడా న‌టించింది ఖ‌ర్వా. ఆ త‌ర్వాత ప్రిన్సెస్ ఆఫ్ స్ల‌మ్ అని పిల‌వ‌డం మొద‌లు పెట్టారు. మూడేళ్ల కింద‌ట ది యువ‌తి క‌లెక్ష‌న్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప‌ని చేసింది. దీంతో తాజాగా ఫారెస్ట్ ఎసెన్షియ‌ల్ అనే బ్రాండ్ మ‌లీషాతో క‌లిసి త‌మ బ్యూటీ ప్రొడ‌క్ట్ ను ప్ర‌మోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపిక చేసింది. పేద పిల్ల‌లు కూడా , మురికి వాడ‌ల్లోంచి కూడా బ్రాండ్ అంబాసిడ‌ర్లు పుట్టుకు వ‌స్తార‌ని నిరూపించింది మ‌లీషా ఖ‌ర్వా. ఇప్పుడు త‌న‌లాంటి పేద పిల్ల‌ల‌కు ఆమె ఓ ఐకాన్ కాదంటారా.

Also Read : Rahul Gandhi Drivers

 

Leave A Reply

Your Email Id will not be published!