Rahul Gandhi Drivers : లారీ డ్రైవర్లతో రాహుల్ ములాఖత్
పవర్ లోకి వస్తే ఆదుకుంటాం
Rahul Gandhi Drivers : రాహుల్ గాంధీ వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. ఆయన తన తండ్రి రాజీవ్ గాంధీని, నాయనమ్మ ఇందిరా గాంధీని ఆదర్శ ప్రాయంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా జనంలోకి వెళ్లేందుకు ఇష్ట పడుతున్నారు. అంతే కాదు ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశంలో చరిత్ర సృష్టించింది. 150 రోజులకు పైగా అలుపెరుగని రీతిలో యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. సమస్యలను విన్నారు. బాధితులకు భరోసా ఇచ్చారు.
తాజాగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి చర్చనీయాంశంగా మారారు. యావత్ దేశం తన వైపు చూసేలా చేశారు. దేశ వ్యాప్తంగా ప్రతి నిత్యం ట్రక్కులు, లారీలు, వాహనాలు నిత్యం ప్రయాణిస్తుంటాయి. దాదాపు అధికారిక లెక్కల ప్రకారం 90 లక్షలకు పైగా డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. కానీ నిత్యం జాతీయ రహదారులు, ఇతర రోడ్ల పై అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో కొందరు తీవ్రంగా గాయపడితే మరికొందరు విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ సందర్బంగా వారికి బీమా దక్కడం లేదు. ప్రత్యేకించి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం దక్కడం లేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశం రాహుల్ గాంధీ దృష్టికి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ కు వెళుతుండగా ఆయన ఉన్నట్టుండి ఎవరికీ చెప్పకుండా లారీ ఎక్కారు. హర్యానా లోని ముర్తాల్ నుంచి అంబాలా వరకు ట్రక్కులోనే గడిపారు. 90 కిలోమీటర్ల మేర ప్రయాణం చేశారు. ఆపై ట్రక్కు డ్రైవర్లతో ముచ్చటించారు. వారి సాదకబాధకాలు విన్నారు రాహుల్ గాంధీ.
Also Read : Bandi Sanjay
