Bandi Sanjay : క‌మ‌లం వ‌స్తేనే కొలువులు లేకుంటే ప‌స్తులు

రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో తీర్మానాలు

Bandi Sanjay : బీజేపీ అధికారంలోకి వ‌స్తేనే కొలువులు ద‌క్కుతాయ‌ని లేకుంటే ప‌స్తులు ఉండాల్సి వ‌స్తుంద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు స్టేట్ చీఫ్ బండి సంజ‌య్(Bandi Sanjay) . కొలువులు రావాలంటే క‌మలం రావాల్సిందేన‌ని, ఈ నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకో పోవాల్సిన బాధ్య‌త పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. మోదీ ప్ర‌ధానిగా కొలువు తీరి 9 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్బంగా బీజేపీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్ర‌చారాన్ని చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింద‌న్నారు బండి సంజ‌య్.

కేంద్ర ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాలు, తీసుకు వ‌చ్చిన ప‌థ‌కాలు, అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు, ల‌బ్ది పొందిన వారి వివ‌రాల‌ను విస్తృతంగా వివ‌రించాల‌ని పిలుపునిచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ మే 30 నుండి జూన్ 30 దాకా మ‌హా జ‌న్ సంప‌ర్క్ అభియాన్ పేరుతో కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న‌పై యుద్దం చేస్తామ‌న్నారు.

నిరంత‌రం స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్ర‌మేన‌ని చెప్పారు. కాంగ్రెస్ ఉన్నా లేకున్నా ఒక్క‌టేన‌న్నారు. ఎందుకంటే ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ క‌లిసే పోటీ చేస్తాయ‌ని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికీ బీజేపీ చేరుకుంటుంద‌న్నారు. ఇవాళ ప్ర‌జ‌లు అభివృద్ది నినాదాన్ని ఆశిస్తున్నార‌ని తెలిపారు. ఏది ఏమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌మ‌లం విక‌సిస్తుంద‌ని అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు.

రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల‌కు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయ‌ని కానీ ఇంత వ‌ర‌కు ఒక్క పోస్ట్ కూడా భ‌ర్తీ చేసిన దాఖలాలు లేవ‌న్నారు బండి సంజ‌య్. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని , ఒక్క‌రు కూడా స‌రిగా ప‌ని చేయ‌డం లేద‌న్నారు.

Also Read : Arvind Kejriwal

Leave A Reply

Your Email Id will not be published!