Sukanta Mazumdar : దాదాకు అవ‌మానం బీజేపీ ఆగ్ర‌హం

సుకాంత మ‌జుందార్ షాకింగ్ కామెంట్స్

Sukanta Mazumdar : బీజేపీ పంచ‌ల‌న కామెంట్స్ చేసింది. బీసీసీఐ మాజీ చీఫ్ సౌర‌వ్ గంగూలీని టీఎంసీ అవ‌మానించందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. స‌రైన గౌర‌వం ఇవ్వ‌కుండా ఇబ్బంది పెట్టిందంటూ పేర్కొంది. కోల్ క‌తా షెరీఫ్ గా నియ‌మించాల‌ని డిమాండ్ చేసింది. క్రికెట్ లెజెండ్ సౌర‌వ్ గంగూలీని త్రిపుర టూరిజం టూరిజం బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించింది. కుంకుమ పార్టీ ఎంపిక‌ను రాజ‌కీయం చేయ‌కూడ‌ద‌న్నారు.

దీనిని తేలిక‌గా తీసుకుంది తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ. టీఎంసీ స‌ర్కార్ ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం గంగూలీకి ఎప్పుడూ త‌గిన గౌర‌వం ఇవ్వ‌లేద‌ని ఆరోపించింది. బీజేపీ నేతృత్వంలోని త్రిపుర ప్ర‌భుత్వం గంగ‌గూలీని త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించిన విష‌యాన్ని గుర్తు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సుకాంత మ‌జుందార్(Sukanta Mazumdar) . భార‌తీయ మాజీ కెప్టెన్ ను మెట్రో పోలీస్ షెరీఫ్ గా నియ‌మించాల‌ని ఎంపీ డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్య‌క్షుడు దిలీప్ ఘోష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఏడాది బీసీసీఐకి ఎన్నికలు జ‌రిగిన స‌మ‌యంలో టీఎంసీ మొస‌లి క‌న్నీరు కార్చిందంటూ ఆరోపించారు.

ప్ర‌తి దానిని రాజ‌కీయం చేయాల‌ని చూస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. కానీ గంగూలీకి ఏదైనా ప‌ద‌వి ఇచ్చిరా అంటూ నిల‌దీశారు. గంగూలీ లాంటి లెజెండ్ బెంగాల్ లో ఉన్న‌ప్పుడు బాలీవుడ్ కు చెందిన న‌టుడు షారుఖ్ ఖాన్ ను ఎందుకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించారంటూ ప్ర‌శ్నించారు. రాష్ట్రంలోని బెంగాలీల భావోద్వేగాల‌ను తీర్చేందుకు టీఎంసీ ఎప్పుడూ ప్ర‌య‌త్నం చేయ‌లేద‌ని ఆరోపించారు.

Also Read : Arvind Kejriwal

Leave A Reply

Your Email Id will not be published!