Surya Kumar Yadav : సూర్యా భాయ్ మెరుపులు వృధా

స్కూప్ షాట్స్ కు పోయి నిరాశ

Surya Kumar Yadav : మ‌రోసారి సూర్య కుమార్ యాద‌వ్(Surya Kumar Yadav) మెరిశాడు. త‌న స‌హ‌జ సిద్ద‌మైన ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్నాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. కానీ త‌న జ‌ట్టును ఫైన‌ల్ కు చేర్చ‌లేక పోయాడు. గుజ‌రాత్ టైటాన్స్ ముందు ఉంచిన భారీ టార్గెట్ ను ఛేదించేలేక ముంబై ఇండియ‌న్స్ చ‌తికిల ప‌డింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో గుజ‌రాత్ టైటాన్స్ 3 వికెట్లు కోల్పోయి 233 ర‌న్స్ చేసింది. శుభ్ మ‌న్ గిల్ 129 ర‌న్స్ చేస్తే సాయి సుద‌ర్శ‌న్ 43 ర‌న్స్ తో రాణించాడు.

అనంత‌రం మైదానంలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ ఆదిలోనే వ‌ధేరా వికెట్ ను కోల్పోయింది. రోహిత్ శ‌ర్మ ఆశించిన రీతిలో రాణించ లేదు. ఆ త‌ర్వాత మైదానంలోకి వ‌చ్చిన సూర్యా భాయ్ దంచి కొట్టాడు. గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఒకానొక ద‌శ‌లో గెలుస్తుంద‌నే ఆశ‌ను క‌లిగించాడు సూర్య‌. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. మ‌రో వైపు హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ రెచ్చి పోయాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు.

18.2 ఓవ‌ర్ల‌లో 171 ర‌న్స్ కే ప‌రిమిత‌మైంది. తిల‌క్ వ‌ర్మ చేతిలో చావు దెబ్బ తిన్నాడు ష‌మీ. ఎలాంటి భ‌యం లేకుండా , జంకు లేకుండా కొట్టాడు. ఫోర్లు , సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. కానీ జ‌ట్టును గెలిపించ లేక పోయాడు.

సూర్య కుమార్ యాద‌వ్(Surya Kumar Yadav) 61 ర‌న్స్ చేశాడు. 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 2 సిక్స‌ర్లు కొట్టాడు. తిల‌క్ వ‌ర్మ రెచ్చి పోయాడు. కేవ‌లం 14 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 43 ర‌న్స్ చేశాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మోహిత్ శ‌ర్మ‌ 14 బంతుల్లో కేవ‌లం 10 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

Also Read : Mohit Sharma

 

Leave A Reply

Your Email Id will not be published!