Tilak Varma : చుక్క‌లు చూపించిన తిలక్ వ‌ర్మ‌

మెరుపు ఇన్నింగ్స్ ఆడినా త‌ప్ప‌ని ఓట‌మి

Tilak Varma : అహ్మ‌దాబాద్ వేదికగా జ‌రిగిన ఐపీఎల్ క్వాలిపైయ‌ర్ -2 మ్యాచ్ లో దుమ్ము రేపింది గుజ‌రాత్ టైటాన్స్. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు బ్యాటర్లు శుభ్ మ‌న్ గిల్. 60 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న గిల్ 60 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 10 సిక్స‌ర్ల‌తో 129 ర‌న్స్ చేశాడు. సాయి సుద‌ర్శ‌న్ 31 బంతులు ఎదుర్కొని 43 ర‌న్స్ చేశాడు. ఇద్ద‌రూ క‌లిసి 138 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 233 ర‌న్స్ చేసింది.

అనంత‌రం 234 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 18.2 ఓవ‌ర్ల‌లోనే చాప చుట్టేసింది. 171 ర‌న్స్ కే ఆలౌటైంది. సూర్య కుమార్ యాద‌వ్ మెరిస్తే తిల‌క్ వ‌ర్మ(Tilak Varma) దంచికొట్టాడు. ప్ర‌ధానంగా స్టార్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీకి చుక్క‌లు చూపించాడు. ఫోర్లు , సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. ఒకానొక ద‌శ‌లో గెలుస్తుంద‌నే ఆశ‌ల‌ను క‌ల్పించారు. కానీ గుజ‌రాత్ బౌల‌ర్ల ధాటికి విల విల లాడారు. ప్ర‌ధానంగా మోహిత్ శ‌ర్మ బౌలింగ్ దెబ్బ‌కు ఠారెత్తి పోయారు. కేవ‌లం 2.2 ఓవ‌ర్లు అంటే 14 బంతులు మాత్ర‌మే వేసిన శ‌ర్మ 10 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు.

అంత‌కు ముందు జంకూ లేకుండా ఆడాడు తిల‌క్ వ‌ర్మ‌. కేవ‌లం 14 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 43 ర‌న్స్ చేశాడు. సూర్య కుమార్ యాద‌వ్ 61 ర‌న్స్ చేశాడు. 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 2 సిక్స‌ర్లు కొట్టాడు.

Also Read : Surya Kumar Yadav

 

Leave A Reply

Your Email Id will not be published!