Shubman Gill : శుభ్ మ‌న్ గిల్ అరుదైన రికార్డ్

అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు

Shubman Gill : ఐపీఎల్ 16వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. గ‌త రెండు నెల‌లుగా కోట్లాది మందిని అల‌రిస్తూ వ‌చ్చిన ఐపీఎల్ ఇక మే 28 ఆదివారంతో ముగియ‌నుంది. ఇదిలా ఉండ‌గా ఈసారి యువ ఆట‌గాళ్లు చ‌రిత్ర సృష్టించారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన య‌శ‌స్వి జైస్వాల్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు చెందిన రింకూ సింగ్ దుమ్ము దులిపారు. సెంచ‌రీల ప‌రంగా చూస్తే గుజ‌రాత్ టైటాన్స్ కు చెందిన శుభ్ మ‌న్ గిల్(Shubman Gill) స‌త్తా చాటాడు. ఏకంగా మూడు సెంచ‌రీల‌తో దంచి కొట్టాడు. జోస్ బ‌ట్ల‌ర్ , హ్యార్ బ్రూక్ , సూర్య కుమార్ యాద‌వ్ సైతం రాణించారు.

తాజాగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన క్వాలిఫైయ‌ర్ -2 మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 233 ర‌న్స్ చేసింది. ఇందులో శుభ్ మ‌న్ గిల్ 60 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 10 సిక్స‌ర్ల‌తో 129 ర‌న్స్ చేశాడు. అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఇంకా ఒక ఫైన‌ల్ మ్యాచ్ మిగిలి ఉంది. ఇప్ప‌టికే ప‌రుగుల వ‌ర‌ద పారించిన జాబితాలో టాప్ లో ఉన్నాడు. ఆర్సీబీ స్కిప్ప‌ర్ పాఫ్ డుప్లెసిస్ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచాడు.

ఇక ఐపీఎల్ సీజ‌న్ లో మూడు సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో గిల్ కూడా చేరాడు. ఆపై అతి త‌క్కువ వ‌య‌సు క‌లిగిన ఆట‌గాడిగా రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇదిలా ఉండ‌గా ఈ ఐపీఎల్ సీజ‌న్ లో మొత్తం 12 సెంచ‌రీలు న‌మోద‌య్యాయి. గిల్ 3 సెంచ‌రీలు చేస్తే, విరాట్ కోహ్లీ 2 సెంచ‌రీలు చేశాడు. క్లాసెన్ , బ్రూక్ , జైస్వాల్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, సూర్య , ప్ర‌భ సిమ్రాన్ సింగ్, కామెరూన్ గ్రీన్ ఒక్కో సెంచ‌రీ చేశారు.

Also Read : GT vs CSK IPL Final 2023

 

Leave A Reply

Your Email Id will not be published!