Hardik Pandya : నా జ‌ట్టును చూసి గ‌ర్విస్తున్నా – పాండ్యా

గెలుపు సాధించేంత దాకా పోరాడుతాం

Hardik Pandya : అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 16వ సీజ‌న్ 2023 టైటిల్ ను కోల్పోయింది గుజ‌రాత్ టైటాన్స్. 5 వికెట్ల తేడాతో చెన్నై ఓడించింది. ఈ సంద‌ర్బంగా మ్యాచ్ అనంత‌రం కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) మీడియాతో మాట్లాడాడు. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. టోర్నీలో మేం అత్యుత్త‌మ‌మైన ఆట‌ను ఆడాం. ప‌లు జ‌ట్ల‌ను మ‌ట్టి క‌రిపించాడు. ఆట అన్నాక గెలుపు ఓట‌ములు ఉంటాయి. కానీ నా జ‌ట్టు అత్యుత్త‌మ‌మైన‌ద‌ని చెప్ప‌డంలో నాకు ఎలాంటి సందేహం లేద‌న్నాడు పాండ్యా.

ఎందుకంటే అన్ని విభాగాల‌లో అద్భుతంగా రాణించారు. ఒక జ‌ట్టును తాను త‌క్కువ చేసి మాట్లాడటం లేద‌ని చెప్పాడు. కానీ అన్ని జ‌ట్ల కంటే త‌మ జ‌ట్టు టాప్ లో ఉంద‌న్నాడు. ఒక వేళ ఓడి పోవాల్సి వ‌స్తే ముందుగా తాను ఉంటాన‌ని అన్నాడు. తాము ఆశించిన దాని కంటే త‌మ ఆట‌గాళ్లు వేయి శాతం అద్భుత‌మైన ప్ర‌దర్శ‌న చేప‌ట్టార‌ని చెప్పాడు.

ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్ అద్భుతంగా ఆడిందంటూ కితాబు ఇచ్చాడు. ఇందులో ఎలాంటి సందేహం లేద‌న్నాడు. ఆఖ‌రి ఓవ‌ర్ మోహిత్ శ‌ర్మ‌కు ఇవ్వ‌డంలో త‌ప్పు లేద‌న్నాడు. ఎందుకంటే త‌మ జ‌ట్టులో అద్భుత‌మైన బౌలర్ల‌లో శ‌ర్మ ఒక‌డ‌ని చెప్పాడు. చివ‌రి దాకా త‌మ వైపు మ్యాచ్ ఉంద‌ని కానీ ర‌వీంద్ర జ‌డేజా మ్యాచ్ మొత్తాన్ని త‌న వైపు తిప్పుకునేలా చేశాడ‌ని కితాబు ఇచ్చాడు హార్దిక్ పాండ్యా. మ‌రో వైపు చెన్నైసూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌న్నాడు.

Also Read : Hardik Pandya

 

Leave A Reply

Your Email Id will not be published!