Shubman Gill Orange Cap : ఆరెంజ్ క్యాప్ విజేత గిల్

890 ప‌రుగుల‌తో టాప్

Shubman Gill Orange Cap : ఐపీఎల్ 16వ సీజ‌న్ ముగిసింది. కోట్లు ఖ‌ర్చు చేసిన ఆట‌గాళ్లు కొంద‌రు రాణిస్తే మ‌రికొంద‌రు తేలి పోయారు. కానీ గుజ‌రాత్ టైటాన్స్ కు చెందిన ఓపెన‌ర్ , యంగ్ బ్యాట‌ర్ శుభ్ మ‌న్ గిల్(Shubman Gill) మాత్రం దుమ్ము రేపాడు. ఈ సీజ‌న్ లో అత్య‌ధికంగా ప‌రుగులు చేసి త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. ఏకంగా 890 ర‌న్స్ చేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఏకంగా సెంచ‌రీలు, హాఫ్ సెంచ‌రీల‌తో మెరిశాడు.

అత‌డితో పాటు ఈసారి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన య‌శ‌స్వి జైస్వాల్ సైతం సూప‌ర్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. కానీ గిల్ త‌ర్వాత నిలిచాడు. ఇక రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ సైతం మూడో స్థానంతో స‌రి పెట్టుకున్నాడు. ఐపీఎల్ ఫైన‌ల్ కు చేరినా ఫ‌లితం లేక పోయింది. గిల్ కేవ‌లం 20 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 7 ఫోర్ల‌తో రెచ్చి పోయాడు. 39 ర‌న్స్ చేశాడు. కానీ జ‌ట్టును గెలిపించ లేక పోయాడు. 17 మ్యాచ్ లు ఆడాడు. 129 అత్య‌ధిక స్కోర్.

క్వాలిఫైయ‌ర్ -1లో చెన్నై చేతిలో ఓట‌మి పాలైన గుజ‌రాత్ టైటాన్స్ ఆ త‌ర్వాత ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ ని మ‌ట్టి క‌రిపించింది. కానీ స్వంత గ్రౌండ్ లో చెన్నై చేతిలో చిత్త‌య్యింది. ఈ అవార్డు కింద గిల్ కు రూ.10 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ ల‌భించింది.

Also Read : IPL 2023 Awards

 

Leave A Reply

Your Email Id will not be published!