Jio Cinema Record IPL : జియో సినిమా అరుదైన రికార్డ్

ఐపీఎల్ 16 లైవ్ స్ట్రీమింగ్ తో

Jio Cinema Record IPL : రిల‌య‌న్స్ గ్రూప్ ఏది చేసినా సంచ‌ల‌నమే. బీసీసీఐ నిర్వ‌హించిన వేలం పాట‌లో ఊహించ‌ని ధ‌ర‌కు బిడ్ ద‌క్కించుకుంది. ఈ మేర‌కు ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) ప్ర‌సార హ‌క్కుల్ని స్వంతం చేసుకుంది. దీంతో మొద‌ట్లో మ్యాచ్ ల ప్ర‌సారానికి సంబంధించి ఓ రేట్ నిర్ణ‌యించాల‌ని అనుకుంది. కానీ ఎంత మంది ఎక్కువ‌గా చూస్తే అంత‌గా రెవిన్యూ వ‌స్తుంద‌ని ప్లాన్ చేసింది.

ఈ మేర‌కు వ‌ర్క‌వుట్ అయ్యింది. ఐపీఎల్ మ్యాచ్ ల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డి నుంచైనా చూడొచ్చంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఇంకేం కోట్లాది మంది జియో సినిమాను డౌన్ లోడ్ చేసుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఇవాళ ఐపీఎల్ అంటేనే జియో సినిమా అన్నంత‌గా ఫ్యాన్స్ దానికి అల‌వాటు ప‌డ్డారు.

ఇక ఐపీఎల్ ఆట ముగిసింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ అనూహ్యంగా టైటిల్ గెలుచుకుంది. ఇక ప్ర‌ధాన మ్యాచ్ ల‌ను ల‌క్ష‌లాదిగా చూశారు జియో సినిమా ద్వారా. ఇదిలా ఉండ‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన జియో ప్ర‌సారంలో సైతం అరుదైన ఘ‌న‌త సాధించింది. త‌మ యూజ‌ర్ల కోసం ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

దీంతో భారీగా జియో సినిమా వైపు మొగ్గు చూపారు. ఇక అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ గుజ‌రాత్ టైటాన్స్ ఫైన‌ల్ మ్యాచ్ ను ఏకంగా 3.2 కోట్ల మంది వీక్షించారు. గ‌తంలో జియో సినిమా పేరుతో ఉన్న 2.57 కోట్ల వ్యూయ‌ర్స్ రికార్డ్ ను జియో సినిమా త‌నే బ్రేక్ చేయ‌డం విశేషం(Jio Cinema Record IPL).

Also Read : SPG Director Sinha

Leave A Reply

Your Email Id will not be published!