Mamata Banerjee : టీఎంసీ చీఫ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీహార్ కు చేరుకున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఇందులో భాగంగా ఆమెకు సాదర స్వాగతం పలికారు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్. మమతా బెనర్జీ నేరుగా మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. ఆ వెంటనే ఆమె లాలూ పాదాలను తాకారు. ఆయన ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నేను బీహార్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాను. లాలూజీ అంటే నాకు ఎనలేని గౌరవం.
రబ్రీ, లాలూను చాలా రోజుల తర్వాత కలుసుకున్నా. సంతోసంగా ఉంది ఇప్పుడు అని చెప్పారు మమతా బెనర్జీ. ఆయన నా కంటే సీనియర్ నాయకుడు. చాలా రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆపరేషన్ కూడా చేసుకున్నారు. ప్రస్తుతం చాలా ధృఢంగా కనిపించారు. నన్ను విస్తు పోయేలా చేశారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా బీజేపీకి వ్యతిరేకంగా రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉన్నారు జేడీయూ చీఫ్ ,
బీహార్ సీఎం నితీశ్ కుమార్. ఆయన అన్ని పార్టీలను ఆహ్వానించారు పాట్నాకు. ఇందులో భాగంగా ఇక్కడికి చేరుకున్నారు మమతా బెనర్జీ(Mamata Banerjee). అయితే బీజేపీని ఢీకొనేంత బలంగా లాలూ కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేశారు సీఎం. కేజ్రీవాల్ హెచ్చరించడాన్ని తప్పు పట్టారు. మనందరం కలిసి కట్టుగా బీజేపీపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలా ఉండగా తన మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీతో కలిసి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : Bandi Sanjay : కాంగ్రెస్ దుష్ప్రచారం అబద్దం – బండి
