Pawan Kalyan : జనం బాగుండాలంటే జగన్ పోవాలి
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). జనం బాగుండాలంటే జగన్ పోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు పవన్ కళ్యాణ్. నీతికి, ధర్మానికి అవినీతికి మధ్య జరిగే పోరాటమన్నారు.
ఇకనైనా మేల్కోవాలని, ఈ రాక్షస పాలన నుండి విముక్తి కావాలంటే జనసేనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తనకు సీఎం పదవిని ఇస్తే అద్భుతమైన పాలన సాగిస్తానని అన్నారు. హలో ఏపీ బైబై వైసీపీ అన్నదే తమ నినాదమన్నారు. అభివృద్ది జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలన్నారు.
అరాచకం, అక్రమాల నుంచి విముక్తి పొందాలంటే మీరు ముందు మారాలన్నారు పవన్ కళ్యాణ్. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కంటే ఏపీ సీఎం జగన్ రెడ్డి గొప్పోడా అని ప్రశ్నించారు. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఉంటే దానిని తీసి వేశాడని, తన పేరు పెట్టుకున్నాడంటూ మండిపడ్డారు .
మద్యం పేరుతో విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన పార్టీ చీఫ్. గంజాయిని తగుల బెట్టించారనే కోపంతో డీజీపీ పోస్టు నుంచి గౌతమ్ సవాంగ్ ను తప్పించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రానికి, ప్రజలకు తీరని ద్రోహం తలపెట్టాడంటూ ఫైర్ అయ్యారు.
Also Read : PM Modi Welcome : మోదీకి తరగని జనాదరణ
