Uttam Kumar Reddy : ప్ర‌చారం అబ‌ద్దం ఉత్త‌మ్ ఆగ్ర‌హం

గులాబీ గూటికి చేరుతారంటూ కామెంట్స్

Uttam Kumar Reddy : టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను పార్టీ మారుతున్నాన‌ని , గులాబీ గూటికి చేరుకుంటున్నాన‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం జ‌ర‌గ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు . శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌న‌పై కావాల‌ని కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారిపై తాను న్యాయ ప‌రంగా ఎదుర్కొంటాన‌ని తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌న‌ని అన్నారు.

గ‌త కొంత కాలంగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పార్టీని వీడుతారని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతే కాదు ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి లాయ‌ల్ గా ఉండ‌డం లేద‌ని, కేసీఆర్ కు స‌పోర్ట్ గా ఉంటున్నాడ‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అంతే కాదు త‌న బంధువు అయిన కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బీఆర్ఎస్ గూటికి ఉత్త‌మ్ కుమార్ రెడ్డినే పంపించారంటూ అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దానిని ఆయ‌న ఖండించారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఈ త‌రుణంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పై మ‌రోసారి ఇలాంటి ప్ర‌చారం జ‌ర‌గ‌డం ఒకింత అనుమానం క‌లిగిస్తోంది. ఇదిలా ఉండ‌గా సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌మ్ ఎక్క‌డికీ వెల్ల‌డ‌ని ఆయ‌న క‌ర‌డుగ‌ట్టిన కాంగ్రెస్ వాది అని చెప్పారు. అయితే త‌న‌పై వ‌స్తున్న ప్ర‌చారం అబ‌ద్ద‌మ‌ని మ‌రోసారి పేర్కొన్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.

Also Read : YV Subba Reddy : టీటీడీ చైర్మ‌న్ సంచ‌ల‌న కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!