Komatireddy Venkat Reddy : డీకేతో కోమ‌టిరెడ్డి భేటీ

రాష్ట్ర రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌

Komatireddy Venkat Reddy : తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. నిన్న‌టి దాకా సైలెంట్ గా ఉంటూ వ‌చ్చిన ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) ఇటీవ‌ల ప్రియాంక గాంధీని క‌లిసి వ‌చ్చాక రూట్ మార్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు క‌లిసి న‌డుస్తున్నారు. అడుగులో అడుగు వేస్తున్నారు. ఇద్ద‌రూ క‌లిసి మీటింగ్ ల‌కు హాజ‌ర‌వుతున్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఇద్ద‌రూ ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో బీఆర్ఎస్ స‌ర్కార్ ను ఏకి పారేస్తున్నారు రేవంత్, కోమ‌టిరెడ్డి.

ఇదిలా ఉండ‌గా ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌న్నీ క‌ర్ణాట‌క చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్క‌డ క‌ర్ణాట‌క ఫార్ములాను అమ‌లు చేయాల‌ని హైక‌మాండ్ భావిస్తోంది. క‌న్న‌డ నాట భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపించి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీని తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ దే. ఆయ‌న ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

తెలంగాణ రాజ‌కీయాల‌ను తెర వెనుక న‌డిపిస్తున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఉన్న‌ట్టుండి ఎంపీ వెంక‌ట్ రెడ్డి శుక్ర‌వారం బెంగ‌ళూరులో ప్ర‌త్యక్షం అయ్యారు. ఆయ‌న డీకేతో భేటీ అయ్యారు. వీరిద్ద‌రి ముచ్చ‌ట ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ష‌ర్మిల‌ను పార్టీలోకి చేర్చుకునే విష‌యంపై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

Also Read : Posani Krishna Murali : ముద్ర‌గ‌డ‌ను తిట్ట‌డం దుర్మార్గం – పోసాని

Leave A Reply

Your Email Id will not be published!