MK Stalin DK : ఎంకే స్టాలిన్ తో డీకే ముచ్చ‌ట‌

విప‌క్షాల కూట‌మి మీటింగ్

MK Stalin DK : బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రుగుతున్న విప‌క్షాల కూట‌మి స‌మావేశానికి సోమ‌వారం డీఎంకే చీఫ్‌, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు కెంపెగౌడ ఎయిర్ పోర్టులో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు కేపీసీసీ చీఫ్ ,డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్.

అక్క‌డి నుంచి ఓ ప్రైవేట్ హోట‌ల్ లో విప‌క్షాల నేత‌ల‌తో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. ఇందుకు అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు డిప్యూటీ సీఎం. ఇప్ప‌టికే తొలి స‌మావేశం బీహార్ రాజ‌ధాని పాట్నాలో కొన‌సాగింది. తాజాగా జ‌రుగుతున్న ఈ మీటింగ్ రెండోది కావ‌డం విశేషం.

ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే సార‌థ్యంలో మొత్తం 24 పార్టీల చీఫ్ ల‌ను ఆహ్వానించారు. ఇందులో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, డీఎంకే చీఫ్ , సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) , జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ , ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ , శివ‌సేన బీటీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే, జార్ఖండ్ సీఎం శిబూ సోరేన్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ కూడా హాజ‌రు కానున్నారు.

ఈ కీల‌క స‌మావేశం రేపు కూడా కొన‌సాగ‌నుంది. సీట్ల స‌మ‌న్వ‌యంతో పాటు బీజేపీకి వ్య‌తిరేకంగా ఎలా వ్య‌వ‌హ‌రించాలన్న దానిపై నిర్ణ‌యం తీసుకోనున్నారు.

Also Read : Pawan Kalyan : తిరుప‌తి ఎస్పీని క‌లిసిన ప‌వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!