Revanth Reddy : రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
నేను ఎవరి చెప్పులు మోయలేదు
Revanth Reddy : తాను ఎవరి చెప్పులు మోయలేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టలేదని స్పష్టం చేశారు. పదవుల కోసం తాను పాకాడ లేదన్నారు .
తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని మరోసారి స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. పొలం పనుల్లో తాను పని చేశానని చెప్పారు. ఉచిత విద్యుత్ ను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. తాను అన్న మాటలను వక్రీకరించారని ఆరోపించారు.
24 గంటల పాటు విద్యుత్ ఇవ్వడం వల్ల రైతులకు సంబంధించిన స్టార్టర్లు, విద్యుత్ మోటార్లు కాలి పోతున్నాయనే బాధతో తాను అన్నానని పేర్కొన్నారు. తాను రైతుల ఇబ్బందులు తొలగించాలని అనుకుంటే బీఆర్ఎస్ మాత్రం కావాలని వాటిని వక్రీకరించేందుకు యత్నిస్తోందంటూ మండిపడ్డారు.
ఎవరు ఎవరికి గులాంగిరి చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఇందుకు ఉదాహరణ కూడా చెప్పారు టీపీసీసీ చీఫ్. మండలి చైర్మన్ , స్పీకర్ లు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారని కానీ స్థాయికి మించి మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
Also Read : MK Stalin DK : ఎంకే స్టాలిన్ తో డీకే ముచ్చట
