Pawan Kalyan : తిరుప‌తి ఎస్పీని క‌లిసిన ప‌వ‌న్

సీఐపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోమ‌వారం తిరుప‌తి ఎప్పి ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డిని క‌లిశారు. ఆయ‌న వెంట సీనియ‌ర్ నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ ఉన్నారు. ఈ సంద‌ర్భంగా తమ పార్టీ కార్య‌క‌ర్త‌ను శ్రీ‌కాళ‌హ‌స్తిలో సీఐ అంజూ యాద‌వ్ చేయి చేసుకున్నార‌ని ఆరోపించారు. ఆమెపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఈ మేర‌కు ఎస్పీకి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ .

ఇదిలా ఉండ‌గా త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని నిరసిస్తూ జ‌న‌సేన(Janasena) ఆధ్వ‌ర్యంలో శ్రీ‌కాళ‌హ‌స్తిలో ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా సీఐ అంజూ యాద‌వ్ నియంత్రించాల్సింది పోయి జ‌న‌సేన నేత చెంప‌ల్ని వాయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి.

చివ‌ర‌కు మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ కూడా స్పందించింది. వెంట‌నే ఈ ఘ‌ట‌న‌పై వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా డీజీపీని కోరింది. దీనిపై ఆరా కూడా తీశారు. ఈ ఘ‌ట‌న చిలికి చిలికి గాలి వాన‌గా మార‌డంతో స్వ‌యంగా రంగంలోకి దిగారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. రెండో విడ‌త వారాహి విజ‌య యాత్ర ఏపీలో కొన‌సాగుతోంది. దీనిని అర్ధాంత‌రంగా నిలిపి వేశారు జ‌న సేన పార్టీ చీఫ్‌. ఇవాళ తిరుప‌తికి ర్యాలీగా బ‌య‌లు దేరారు. ఎస్పీ ఆఫీసులో ఎస్పీని క‌లిసి సీఐ అంజూ యాద‌వ్ ను వెంట‌నే తొల‌గించాల‌ని కోరారు.

Also Read : MP Sanjay Singh : మోదీ స‌ర్కార్ ఆర్డినెన్స్ చెల్ల‌వు

 

Leave A Reply

Your Email Id will not be published!