MP Sanjay Singh : మోదీ సర్కార్ ఆర్డినెన్స్ చెల్లవు
బీజేపీలో చేరితే దావూద్ పై కేసులుండవు
MP Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వందలాది మందిని పొట్టన పెట్టుకున్న కరుడుగట్టిన నేరస్థుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గనుక బీజేపీలో చేరితే ఎలాంటి కేసులంటూ ఉండవంటూ సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ప్రభుత్వం అడుగడుగునా తమను అడ్డుకోవాలని చూస్తోందన్నారు సంజయ్ సింగ్. కేంద్రం జారీ చేసిన బ్లాక్ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని , తాము ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు ఎంపీ. తాము కూడా ఇదే కోరుకున్నామని పేర్కొన్నారు.
ఇవాళ బెంగళూరు వేదికగా జరుగుతున్న విపక్షాల కూటమి కీలక భేటీకి తమ పార్టీ తరపున కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారని తెలిపారు ఎంపీ. ఇప్పటికే పాట్నా వేదికగా జరిగిన కీలక భేటీలో కూడా హాజరైన విషయాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు సంజయ్ సింగ్(MP Sanjay Singh). యూపీలో భారతీయ జనతా పార్టీ ఒక పార్టీతో పొత్తు పెట్టుకుందన్నారు. మరి మోడీ ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు.
రూ. 70,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఇప్పటి వరకు మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ మోడీ తన పరివారంలో చేర్చుకున్నారని ధ్వజమెత్తారు. రేపు దావూద్ ఇబ్రహీం కూడా బీజేపీలో చేరితే ఇక కేసులంటూ ఉండవంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : DK Shiva Kumar : దేశమంతటా కర్ణాటక రిజల్ట్స్ రిపీట్
