Sanju Samson : సంజూ శాంస‌న్ కు లాస్ట్ ఛాన్స్

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కు రెస్ట్

Sanju Samson : విండీస్ టూర్ లో భాగంగా భార‌త జ‌ట్టు కీల‌క‌మైన మూడో వ‌న్డేకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే భార‌త్ , వెస్టిండీస్ జ‌ట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. తొలి వ‌న్డేలో టీమిండియా విక్ట‌రీ సాధిస్తే రెండో వ‌న్డే లో విండీస్ విజ‌య కేత‌నం ఎగుర వేసింది. దీంతో వ‌న్డే సీరీస్ ను నిర్ణ‌యించే కీల‌క‌మైన మ్యాచ్ ఇవాళ జ‌ర‌గ‌నుంది. ఇక ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది భార‌త్. బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ ప‌లు మార్పులు చేసింది.

Sanju Samson Enters

కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్(Sanju Samson) కు ఇదే ఆఖ‌రి ఛాన్స్ . రెండో వ‌న్డేలో అవ‌కాశం ఇచ్చినా స‌ద్వినియోగం చేసుకోలేక పోయాడు. మ‌రో వైపు ముంబైక‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ టి20 ఫార్మాట్ లో అద్భుతంగా రాణిస్తున్నా వ‌న్డే ఫార్మాట్ లో స‌రైన ఆట తీరు ప్ర‌ద‌ర్శించ‌డం లేదు.

ఇప్ప‌టికే హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఇద్ద‌రికీ ప‌రోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు. ఆడితే జ‌ట్టులో ఉంటార‌ని లేక పోతే వేటు వేయ‌క త‌ప్ప‌ద‌ని తేల్చేశాడు. ఎందుకంటే గ‌తంలో కంటే ప్ర‌స్తుతం జ‌ట్టులోకి వ‌చ్చే ఆట‌గాళ్ల సంఖ్య పెరిగింది. రాణిస్తే ఉంటారు లేక పోతే ఉండ‌ర‌ని స్ప‌ష్టం చేశాడు.

రోహిత్, కోహ్లీకి రెస్ట్ ఇవ్వ‌డంతో పాండ్యా స్కిప్ప‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇప్ప‌టికే సిరాజ్ గాయం కావ‌డంతో దూర‌మ‌య్యాడు. మ‌రి మిగ‌తా ప్లేయ‌ర్లు ఏ మేర‌కు రాణిస్తారో వేచి చూడాలి.

Also Read : Dasoju Sravan Kumar : బ‌ల‌మైన గొంతుక ‘దాసోజు’

 

Leave A Reply

Your Email Id will not be published!