Amit Shah : ఒక్క ఓటుతో ఓడినా కొనుక్కోలేదు

కాంగ్రెస్ పార్టీపై అమిత్ చంద్ర షా

Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నిప్పులు చెరిగారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీ చ‌రిత్ర మొత్తం అవినీతి అని మండిప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చ‌రిత్ర‌ను మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. 1999లో దేశ ప్ర‌ధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ఈ స్థానంలో కూర్చున్నారు. కేవ‌లం ఒకే ఒక్క ఓటుతో త‌న బ‌ల‌మైన అధికారాన్ని కోల్పోయారు. కానీ బాధ ప‌డలేదు. ఎవ‌రినీ సాగిడ ప‌డ‌లేదు. ఇది ఆయ‌న రాజ‌కీయ నిబ‌ద్ద‌త‌కు ఉన్న చ‌రిత్ర‌.

Amit Shah Slams Congress

కానీ అధికారాన్ని తిరిగి పొంద‌డానికి ఎలాంటి ప‌క్క‌దారులు చూడ‌లేదు. ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు. ఎవ‌రినీ బెదిరించలేదన్నారు. ఎవ‌రినీ ప్ర‌లోభాల‌కు గురి చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక్క పైసా తీసుకోలేదు. ఎవ‌రినీ సిఫార‌సు చేయ‌లేదు. ఇదీ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన అట‌ల్ జీ చ‌రిత్ర‌.

కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాముల‌ప‌ర్తి న‌ర‌సింహారావులా అవినీతితో అధికారం కోసం అర్రులు చాచ లేద‌న్నారు అమిత్ చంద్ర షా. కానీ అట‌ల్ జీ తిరిగి భారీ మెజారిటీతో ప‌వ‌ర్ లోకి వ‌చ్చార‌ని గుర్తు చేశారు అమిత్ షా(Amit Shah). విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చింది మీరు కాదా అని నిల‌దీశారు. దీనిని మొత్తం ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని తెలుసు కోవాల‌న్నారు.

Also Read : K Annamalai Visit : ర‌మ‌ణాశ్ర‌మంలో దివ్యానుభూతి

Leave A Reply

Your Email Id will not be published!