K Annamalai Visit : ర‌మ‌ణాశ్ర‌మంలో దివ్యానుభూతి

సంతోషం వ్య‌క్తం చేసిన కె.అన్నామ‌లై

K Annamalai Visit : త‌మిళ‌నాడు బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామ‌లై పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఆయ‌న ప‌లు ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తున్నారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటున్నారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రిస్తున్నారు. ఆయా ప‌థ‌కాల ద్వారా ల‌బ్ది పొందిన వారిని స్వ‌యంగా క‌లుస్తున్నారు. ఎలా ఉందంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

K Annamalai Visit Virudhunagar

ఈ త‌రుణంలో ఆయ‌న ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌త‌కు ఆల‌వాలంగా మారిన శ్రీ ర‌మ‌ణ మ‌హ‌ర్షి పుట్టిన స్థ‌లాన్ని సంద‌ర్శించారు. ఇది విరుదునగర్ జిల్లా తిరుచూజిలో ఉంది. శ్రీ భ‌గ‌వాన్ ను సంద‌ర్శించే భాగ్యం త‌న‌కు క‌లిగింద‌ని ఈ సంద‌ర్భంగా కె. అన్నామలై(K Annamalai) తెలిపారు.

చిన్న వ‌య‌సు లోనే ఆధ్యాత్మిక త‌ప‌నలో మునిగి తిరువ‌ణ్ణామ‌లైలో జ్ఞానోద‌యం పొందిన భ‌గ‌వాన్ శ్రీ ర‌మ‌ణ మ‌హ‌ర్షి ఆత్మ జ్ఞాన‌మే ఆధ్యాత్మిక అని స్ప‌ష్టం చేశార‌న్నారు. ప్రతి ఒక్క‌రు త‌మ హృద‌యాల‌లో శోధించి , తార‌త‌మ్యం లేకుండా అంద‌రికీ వ‌ర్తింప చేస్తే దేవుడు సుల‌భంగా దొరుకుతాడ‌ని సెల‌విచ్చిన మ‌హ‌నీయుడు శ్రీ భ‌గ‌వాన్ ర‌మ‌ణ మ‌హ‌ర్షి అని కొనియాడారు కె. అన్నామ‌లై.

ర‌మ‌ణ మ‌హ‌ర్షి ఆశ్ర‌మంలో మంత్ర ముగ్దుల‌ను చేసే దివ్య మైన అనుభూతిని, చెదిరి పోని మ‌న‌శ్శాంతిని పొందాన‌ని స్ప‌ష్టం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్.

Also Read : Minister KTR : సంచులు మోసేటోడు రేవంత్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!