TDP Slams TTD : టీటీడీ నిర్ణ‌యం టీడీపీ ఆగ్ర‌హం

క‌ర్ర‌లు భ‌క్తుల్ని కాపాడుతాయా

TDP Slams TTD : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణ‌యంపై మిశ్రమ స్పంద‌న వ్య‌క్తం అవుతోంది. ఇటీవ‌ల రెండు ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి కాలి న‌డ‌క‌న‌. చిరుత పులి దాడి చేయ‌డంతో ల‌క్షిత అనే చిన్నారి మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ఇరు తెలుగు రాష్ట్రాల‌లో క‌ల‌క‌లం రేపింది. దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది టీటీడీ.

TDP Slams TTD Ruling

ఈ మేర‌కు కొత్తగా టీటీడీ చైర్మ‌న్ గా కొలువు తీరిన తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. భ‌క్తుల భ‌ద్ర‌త కోసం ఎంత ఖ‌ర్చు అయినా ప‌ర్వాలేదు పెడ‌తామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో కాలి న‌డ‌క‌న తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ర‌క్ష‌ణ‌గా చేతి క‌ర్ర‌ల‌ను ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

తిరుమ‌ల నుంచి రోడ్డు మార్గం ద్వారా, అలిపిరి నుంచి , శ్రీ‌వారి మెట్ల నుంచి కొండ పైకి నిత్యం వేలాది మంది భ‌క్తులు వెళుతుంటారు. ఇటీవ‌ల క్రూర మృగాల దాడులు ఎక్కువ‌య్యాయి. దీంతో భ‌క్తులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ఈ మేర‌కు భ‌క్తుల‌కు రక్ష‌ణ‌గా ఉండేందుకు గాను 100 మంది సెక్యూరిటీ గార్డుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు టీటీడీ చైర్మ‌న్ . ఇదే స‌మ‌యంలో అట‌వీ శాఖ సూచ‌న మేర‌కు చేతి క‌ర్ర‌ల‌ను భ‌క్తుల‌కు ఇస్తున్న‌ట్లు చెప్పారు. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది టీడీపీ. చేతి క‌ర్ర‌లు భ‌క్తుల‌ను చిరుత‌ల నుంచి కాపాడుతాయా అని ప్ర‌శ్నించింది.

Also Read : MLA Jagga Reddy : ఎమ్మెల్యే జ‌గ్గ‌న్న దారెటు

Leave A Reply

Your Email Id will not be published!