MLA Jagga Reddy : ఎమ్మెల్యే జగ్గన్న దారెటు
బీఆర్ఎస్ లో చేరుతారంటూ ప్రచారం
MLA Jagga Reddy : కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ మధ్యన మౌనంగా ఉంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొలువు తీరాక గతంలో పార్టీలో ఉన్న నాయకులకు, కొత్తగా వచ్చిన నేతలకు మధ్య పొసగడం లేదు. పలువురిని పార్టీ హైకమాండ్ మార్చింది. రేవంత్ దాడి తట్టుకోలేక మర్రి శశిధర్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మేధావిగా గుర్తింపు పొందిన దాసోజు శ్రవణ్ రేవంత్ పై నిప్పులు చెరిగారు. ఆ వెంటనే ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఇక ప్రతి నిత్యం రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
MLA Jagga Reddy Party Change Viral
తాజాగా జగ్గన్న భారత రాష్ట్ర సమితి పార్టీతో టచ్ లో ఉన్నారని ఆయన త్వరలోనే పార్టీ కండువా కప్పుకోనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన దీనిని ఖండిస్తూ వచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారబోనంటూ ప్రకటించారు. గాంధీ భవన్ సాక్షిగా మీడియాతో చిట్ చాట్ కూడా చేశారు.
ఇదే సమయంలో ఇటీవల అసెంబ్లీ జరుగుతున్న సమయంలో జగ్గారెడ్డి(MLA Jagga Reddy) , మంత్రి కేటీఆర్ తో ముచ్చటిస్తున్న ఫోటోలు హల్ చల్ చేశాయి. మరో వైపు పార్టీలోనే కొందరు కోవర్టులు ఉన్నారని వారిని బయటకు పంపిస్తే కానీ బాగు పడదన్న ప్రచారం జోరందుకుంది. మొత్తం మీద త్వరలో ఎన్నికలు రానుండడంతో జగ్గన్న ఎటు వైపు ఉంటారనేది ఉత్కంఠ రేపుతోంది.
Also Read : Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి ఘాటు కామెంట్స్
