Komatireddy Venkat Reddy : కోమ‌టిరెడ్డి ఘాటు కామెంట్స్

రియ‌ల్ట‌ర్లు, కాంట్రాక్ట‌ర్లు వెళ్లి పోవాలి

Komatireddy Venkat Reddy : భువ‌న‌గ‌రి ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఆయ‌న చేస్తున్న కామెంట్స్ పార్టీకి మేలు చేకూర్చ‌క పోగా డ్యామేజ్ అయ్యేలా చేస్తున్నాయ‌ని పార్టీలోని కొంద‌రు నేత‌లు వాపోతున్నారు. ఇవాళ జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ఆయ‌న ఏకంగా కాంట్రాక్ట‌ర్లు, రియ‌ల్ట‌ర్ల‌ను టార్గెట్ చేసుకుని కామెంట్ చేశారు. వారిని ఉద్దేశించి కోమిట‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Komatireddy Venkat Reddy Comments Viral

కాంగ్రెస్ పార్టీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న కాంట్రాక్టర్లు, రియ‌ల్ట‌ర్లు వెళ్లి పోవాల‌ని స్ప‌ష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే తాజాగా ఖ‌మ్మం వేదిక‌గా పార్టీ ఎంపీ , మాజీ ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కూడా ఓ బ‌డా , పేరు మోసిన కాంట్రాక్ట‌ర్. ఇలాంటి కాంట్రాక్ట‌ర్లు చాలా మంది అన్ని పార్టీల‌లో ఉన్నారు. విచిత్రం ఏమిటంటే ఆయ‌న సోద‌రుడు రాజ‌గోపాల్ రెడ్డి కూడా గుర్తింపు పొందిన కాంట్రాక్ట‌ర్.

ఇక కాంట్రాక్ట‌ర్లు, గుత్తేదారులు, రియ‌ల్ట‌ర్లు లేకుండా ఇప్పుడు పార్టీలు మ‌నుగ‌డ సాధించే స్థితిలో లేవు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో పేరుకు ఎమ్మెల్యేలైనా అంతా కాంట్రాక్ట‌ర్లేన‌న్న ఆరోప‌ణ‌లు లేక పోలేదు. ఇక కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఫ‌క్తు కాంట్రాక్ట‌ర్లు, రియ‌ల్ట‌ర్లు, బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపార‌వేత్త‌లు ఉన్నారనేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

Also Read : Pandit Nehru : దేశ‌పు మార్గ‌ద‌ర్శిని మార్చ‌లేరు

Leave A Reply

Your Email Id will not be published!