Gangavaram Port Comment : గంగ‌వ‌రం ఓడ రేవుకు దిక్కేది

అప్ప‌నంగా క‌ట్ట‌బెడితే ఎలా

Gangavaram Port Comment : ఈ దేశంలో మోదీ వ‌చ్చాక గాలి త‌ప్ప అన్నీ ప్రైవేట్ పరం అవుతున్నాయి. ప్ర‌త్యేకించి ఒకే ఒక్క కంపెనీకి ల‌బ్ది చేకూరుతోంది. అది ఎవ‌రో చెప్పాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే ప‌దే ప‌దే కొన్ని వేల‌సార్లు నిత్యం రాహుల్ గాంధీ జ‌పించే పేరు గౌత‌మ్ అదానీ. ఆయ‌న వేలు పెట్ట‌ని రంగం అంటూ లేదు. మోదీ ప్ర‌ధాని అయ్యాక ఆయ‌న జెట్ వేగంతో దూసుకు వెళ్లారు. ఇత‌ర వ్యాపార‌వేత్త‌ల‌ను త‌ల‌ద‌న్నేలా టాప్ లోకి వెళ్లి పోయారు. ఆయా బ్యాంకుల‌లో రుణాల మాట ప‌క్క‌న పెడితే అదానీ అంటేనే ఓడ రేవులు గుర్తుకు వ‌స్తాయి. ఇక ఏపీకి త‌ల‌మానికంగా ఉంటూ వ‌చ్చిన గంగ‌వ‌రం పోర్టు మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.

కార‌ణం వేలాది మంది కార్మికులు ముట్ట‌డించారు. త‌మ‌కు క‌నీస వేత‌నం కావాల‌ని ఆందోళ‌న బాట ప‌ట్టారు. పోలీసులు అదానీ గంగవ‌రం పోర్టుకు(Gangavaram Port) ర‌క్ష‌ణ‌గా నిలిచారు. కార్మికులు , ఖాకీలు గాయ‌ప‌డ్డారు. ఇదంతా ప‌క్క‌న పెడితే ఎవ‌రైనా న‌ష్టాల్లో ఉన్న వాటిని విక్ర‌యించ‌డ‌మో లేదా లీజుకు ఇవ్వ‌డ‌మో చేస్తారు.. కానీ మోదీ వ‌చ్చాక ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా అదానీ ప‌రం చేస్తూ పోయాడు. అందులో భాగ‌మే ఈ గంగ‌వ‌రం పోర్టు. అదానీ గ్రూప్ క‌న్ను ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప‌డింది.

Gangavaram Port Comment Issue Viral

అదానీ ఫోక‌స్ అంతా స్టార్టింగ్ లో ఉన్న కంపెనీల‌ను అస‌లు ముట్ట‌డు. కేవ‌లం లాభాల బాట ప‌ట్టిన వాటిపై దృష్టి పెడ‌తాడు. మ‌నోడు ఎక్క‌డా క‌నిపించడు. క‌నీసం ప‌ల్లెత్తు మాట కూడా మాట్లాడ‌డు. కానీ వెనుక నుంచి న‌రుక్కుంటూ వ‌స్తాడు. ఆ మ‌ధ్య‌న ఇలాగే చేశాడు శ్రీ‌లంక‌లో. చివ‌ర‌కు అక్క‌డి వారంతా త‌మకు అదానీ గ్రూప్ వ‌ద్దంటూ ఆందోళ‌న బాట ప‌ట్టారు. అది సెన్సేష‌న్ . స‌రిగ్గా అలాంటి సీన్ ఇవాళ రిపీట్ అయ్యింది గంగ‌వ‌రం పోర్టు వ‌ద్ద‌. ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు చెందిన ఆస్తి కాదు. ఇది అదానీకి గంప గుత్త‌గా ఇచ్చేశారు. ఏపీ స‌ర్కార్ గంగ‌వ‌రం పోర్ట్(Gangavaram Port) లో త‌న వాటాను అదానీ గ్రూప్ కు అమ్మేసింది తెలివిగా. అంటే ప్ర‌భుత్వానికి ఎలాంటి ప‌ట్టు ఉండ‌దు. ఇదే వ్యాపారంలో దాగి ఉన్న మ‌త‌ల‌బు. గంగ‌వ‌రం పోర్ట్ లిమిటెడ్ (జీపీఎల్) అనేది రుణ ర‌హిత‌ సంస్థ‌. 80 శాతానికి పైగా వ్యాపారం దీని ద్వారానే సాగుతుంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై కార్మిక సంఘాలు, ఫోర‌మ్ ఫ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ ఆఫ్ నార్త్ ఆంధ్ర సంస్థ‌లు అభ్యంత‌రం తెలిపాయి.

కానీ ప‌ట్టించు కోలేదు. ఇదే స‌మ‌యంలో అదానీ గ్రూప్ కు చెందిన ఫ్లాగ్ షిప్ ట్రాన్స్ పోర్టేష‌న్ విభాగం ఏపీఎస్ఈజెడ్ జీపీఎల్ లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. దీంతో గంగ‌వ‌రం అదానీ ప‌రం అయ్యింది. ఇవాళ కార్మికుల‌ను వేధింపుల‌కు గురి చేస్తూ వ‌స్తున్న యాజ‌మాన్యం ప‌ట్టించుకునే స్థితిలో లేదు. గ‌తంలో ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న ఓడ రేవు పూర్తిగా ప్రైవేట్ ప‌రం కావ‌డమే అస‌లు స‌మ‌స్య‌.

ఈ పోర్టు ద్వారా భారీ వ్యాపారం జ‌రుగుతుంది. ప్ర‌తి ఏటా స‌గ‌టును 50 ల‌క్ష‌ల ట‌న్నుల కోకింగ్ బొగ్గు, 1.2 ల‌క్ష‌ల ట‌న్నుల సున్న‌పురాయి ఈ పోర్డు ద్వారా వెళుతుంది. ఇదే స‌మ‌యంలో కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి. రూ. 3,00 కోట్ల‌కు పైగా విలువ చేసే 1,800 ఎక‌రాల భూమిని కేవ‌లం రూ. 650 కోట్ల‌కు ప్ర‌భుత్వం ఇవ్వ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. జీపీఎల్ వేయి కోట్ల‌కు పైగా ఆర్జించింది. అందుకే అదానీ గ్రూప్ దానిపై క‌న్నేసింది. అంతా అయి పోయాక పోరాడితే వ‌చ్చేదేమీ ఉండ‌ద‌ని తెలుసు కోవ‌డ‌మే మిగిలింది.

Also Read : Arvind Kejriwal : మ‌ణిపూర్ తో సంబంధం లేదంటే ఎలా

Leave A Reply

Your Email Id will not be published!