Anasuya Bharadwaj : అయ్యో అన‌సూయ కంట‌తడి

సోష‌ల్ మీడియాలో నిర్వాకంపై ఆవేద‌న

Anasuya Bharadwaj : టాలీవుడ్ లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ గురించి ఎక్కువ‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆమె కొన్ని సినిమాల‌లో న‌టించారు. సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా యాక్టివ్ గా ఉంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌నకు సంబంధించిన విశేషాల‌తో ఫోటోల‌ను, వీడియోల‌ను పంచుకుంటారు. అయితే ఉన్న‌ట్టుండి అన‌సూయ కంట త‌డి పెట్ట‌డం విస్తు పోయేలా చేసింది. ఎంద‌రినో న‌వ్విస్తూ, ఆక‌ట్టుకునే పాత్ర‌ల్లో జీవిస్తూ త‌న‌ను తాను న‌టిగా ప్రూవ్ చేసుకున్న అన‌సూయ ఉన్న‌ట్టుండి ఇలా ఏడ్వ‌డం ప్ర‌తి ఒక్క‌రినీ బాధ‌కు గురి చేసింది.

Anasuya Bharadwaj Emotional

ఎందుక‌ని ఆమె ఏడ్చింద‌నే విష‌యంపై ఆరా తీస్తే ఈ మ‌ధ్య‌న ఎక్కువ‌గా త‌న‌ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారంటూ వాపోయింది. ఇందుకు సంబంధించిన ఏడుస్తున్న వీడియో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఇది నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

కావాల‌ని కొంద‌రు త‌న‌ను టార్గెట్ చేస్తున్నారంటూ వాపోయింది. ప్ర‌త్యేకించి ప‌నిగ‌ట్టుకుని త‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కంట త‌డి పెట్టింది. ట్రోలింగ్ చేస్తూ త‌న‌ను మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నారంటూ వాపోయింది అన‌సూయ భ‌ర‌ద్వాజ్(Anasuya Bharadwaj). సినిమాల‌లో కీల‌క‌మైన పాత్ర‌ల‌లో న‌టించింది.

మ‌రికొన్ని సినిమాల‌లో న‌టిస్తోంది. బుల్లి తెర‌పై ఆమె కీల‌క‌మైన వ్య‌క్తిగా కొన‌సాగుతూ ఉన్నారు. ఈ త‌రుణంలో ఇలా ఏడ్వ‌డం ఎందుక‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ధైర్యంగా ఎదుర్కోవాలే త‌ప్పా ఏడుస్తారా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

Also Read : Sudham Das Row : సుధామ్ దాస్ నామినేట్ పై ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!