India vs Ireland 2nd T20 : సిరీస్ పై క‌న్నేసిన టీమిండియా

ఐర్లాండ్ తో రెండో టీ20 మ్యాచ్

India vs Ireland 2nd T20 : ఏడాది కాలం త‌ర్వాత తిరిగి ఎంట్రీ ఇచ్చిన జ‌స్ప్రీత్ బుమ్రా సార‌థ్యంలోని భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌స్తుతం ఐర్లాండ్ లో టి20 సీరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్ లో డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిన 3 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. దీంతో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇక ఆదివారం సీరీస్ ను నిర్ణ‌యించే కీల‌క‌మైన 2వ టి20(India vs Ireland 2nd T20) మ్యాచ్ ఆడ‌నుంది. సీరీస్ లో భాగంగా ఇరు జ‌ట్లు మూడు మ్యాచ్ లు ఆడ‌నున్నాయి. ఈ సీరీస్ పై సెలెక్ట‌ర్లు ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. రాత్రి 7.30 గంట‌ల నుండి మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

India vs Ireland 2nd T20 will Start

బ్యాటింగ్ ప‌రంగా భార‌త జ‌ట్టును ప‌క్క‌న పెడితే బౌలింగ్ ప‌రంగా దుమ్ము రేపారు. దీంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బోర్లా ప‌డింది. చాన్నాళ్ల త‌ర్వాత పున‌రాగ‌మ‌నం చేసిన బుమ్రా స‌త్తా చాటాడు. మ‌రో వైపు ఆగ‌స్టు 21న ఆసియా క‌ప్ కోసం బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ ఆధ్వ‌ర్యంలో జ‌ట్టును ఎంపిక చేయ‌నుంది.

దీంతో ఎవ‌రు రాణిస్తారో వారినే ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. ఈ త‌రుణంలో ఎవ‌రు ఉంటార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌స్తుతం కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ప‌రిస్థితి దారుణంగా ఉంది. గ‌త కొంత కాలంగా ఛాన్స్ లేక నానా తంటాలు ప‌డిన శాంస‌న్ ఉన్న‌ట్టుండి విండీస్ టూర్ లో దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో పోటెత్తిన భ‌క్తజ‌నం

Leave A Reply

Your Email Id will not be published!