Liquor Shop Licence : రూ. 100 కోట్లు 110 వైన్ షాప్స్
ఏపీ రియల్ ఎస్టేట్ కంపెనీ
Liquor Shop Licence : తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన లిక్కర్ షాప్స్ కేటాయింపులు పూర్తయ్యాయి. ఏకంగా 1,31, 000 కు పైగా దరఖాస్తులు వచ్చాయి. విచిత్రం ఏమిటంటే గతంలో ఎన్నడూ లేనంతగా కేవలం దరఖాస్తుల ద్వారానే భారీ ఆదాయం సమకూరింది రాష్ట్ర ఆబ్కారీ శాఖకు.
Liquor Shop Licence Viral
ఇదే సమయంలో పెద్ద ఎత్తున ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన వారు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏకంగా మద్యం దుకాణాలు దక్కించు కునేందుకు ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.
మొత్తం వైన్ షాప్స్ కోసం ఏకంగా సదరు కంపెనీ 5,000 దరఖాస్తులు చేసుకుంది. ఒక్కో దరఖాస్తుకు రూ 2,00,000 ఉంటుంది. అంటే వంద కోట్లు అన్నమాట. ఒక్కో దుకాణం ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందో ఆలోచించు కోవచ్చు.
ఈసారి జరిగిన మద్యం టెండర్ల లో ఏపీకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ భారీ ఎత్తున ఖర్చు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కంపెనీ వెనుక ఎవరు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. బీఆర్ఎస్(BRS) మంత్రులు, నేతల సపోర్ట్ లేకుండా ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు.
Also Read : Mynampally Hanumantha Rao : బీఆర్ఎస్ కు మైనంపల్లి గుడ్ బై