Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ – టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఇరు తెలుగు రాష్ట్రాల గురించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణకు, ఆంధ్రాకు ..సౌత్ కొరియాకు నార్త్ కొరియాకు మధ్య ఉన్నంత తేడా వచ్చిందని పేర్కొన్నారు.
Chandrababu Naidu Comments Viral
అన్ని రంగాలలో తెలంగాణ ప్రస్తుతం దూసుకు పోయేందుకు సిద్దంగా ఉందని అనే అర్థంలో చెప్పారు. ఇటీవల చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) స్వరంలో మార్పు వచ్చింది. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా పని చేస్తూ వచ్చారు. ఉమ్మడి ఏపీలో ఉన్న సమయంలో పూర్తి వివక్షను ప్రదర్శించారన్న అపవాదు మూటగట్టుకున్నారు.
బాబు కేబినెట్ లో ఉన్న ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దానిని ఫక్తు రాజకీయ పార్టీగా మార్చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కొలువు తీరారు.
దీంతో చంద్రబాబుకు కేసీఆర్ కు మధ్య దూరం పెరిగింది. మాటల యుద్దం మొదలైంది. చివరకు ఎవరికి వారు సైలెంట్ గా మారి పోయారు. అప్పుడప్పుడు చంద్రబాబు గురించి సెటైర్లు వేస్తూ వస్తున్నారు సీఎం కేసీఆర్. ఏపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు చంద్రబాబు. ఇదే సమయంలో ఆయనకు ఐటీ నోటీసులు ఇవ్వడం చర్చకు దారి తీసింది.
Also Read : TTD Chairman : భక్తులకు చేతి కర్రలు పంపిణీ
