Rahul Gandhi Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రకు ఏడాది
గత ఏడాది సెప్టెంబర్ 7న స్టార్ట్
Rahul Gandhi Bharat Jodo Yatra : న్యూఢిల్లీ – దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అంటూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేపట్టి చరిత్ర సృష్టించారు ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. సరిగ్గా ఇదే రోజు గత ఏడాది 2022 సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ తమిళనాడు నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.
Rahul Gandhi Bharat Jodo Yatra Memories
ఆయన చేపట్టిన పాదయాత్ర 145 రోజుల పాటు సాగింది. యావత్ దేశంలోని అన్ని వర్గాలు కదలి వచ్చాయి. రాహుల్ గాంధీతో(Rahul Gandhi) కలిసి నడిచారు. వేలాది మంది ఆయన వెంట ఉన్నారు. ఆనాటి స్వాతంత్ర ఉద్యమ సమయంలో చేపట్టిన ఆందోళనను గుర్తుకు తీసుకు వచ్చింది.
ఈ సందర్భంగా పలు రాష్ట్రాలలో ప్రజలను స్వయంగా కలుసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన వారు రాహుల్ గాంధీతో చేతులు కలిపారు. ఒక రకంగా భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ ఒక్కసారిగా దేశంలో లైమ్ లైట్ గా మారి పోయారు.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం ఆయన చేపట్టిన పాదయాత్రకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ రోజు రోజుకు భారీ ఎత్తున జనం వస్తుండడం, అనూహ్యమైన రీతిలో ఆదరణ లభించడంతో గత్యంతరం లేక స్పందించాల్సి వచ్చింది. మొత్తంగా రాహుల్ గాంధీ నేషనల్ లీడర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు ఈ యాత్రతో. మరోసారి యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.
Also Read : Chandrababu Naidu : ఏపీకి తెలంగాణకు భారీ తేడా
